మనకు తెలియని జగన్… ?

అదేంటి జగన్ అంటే ఏపీ సీఎం కదా. ఆయన గురించి ఎవరికీ తెలియకపోవడం ఏంటి అన్న డౌట్ రావచ్చు. కానీ ఇది నిజం. చాలా మందికి జగన్ [more]

Update: 2021-07-11 11:00 GMT

అదేంటి జగన్ అంటే ఏపీ సీఎం కదా. ఆయన గురించి ఎవరికీ తెలియకపోవడం ఏంటి అన్న డౌట్ రావచ్చు. కానీ ఇది నిజం. చాలా మందికి జగన్ వ్యక్తిగత అభిరుచులు తెలియవు. ఆయన మెంటాలిటీ కూడా తెలియదు. ఇక జగన్ విద్యార్హతలు కూడా ఎవరూ చెప్పలేరు. మరి ఆయన హాబీస్ ఏంటి అంటే అది కూడా తెలియదు. జగన్ వైఎస్సార్ కుమారుడుగా ఉంటూ హఠాత్తుగా రాజకీయ ప్రవేశం చేశారు. తక్కువ వ్యవధిలోనే ఆయన సొంత పార్టీ పెట్టి జనంలోకి వచ్చారు. పదేళ్ళ పాటు పోరాడి ఏపీకి సీఎం అయిపొయారు. మరి జగన్ ప్రజలతో ఎంతో చనువుగా ఉన్నట్లు కనిపించినా అది కొంతవరకే అని కూడా అర్ధమవుతోంది.

ప్రొఫెషనలేనా..?

ఇవన్నీ పక్కన పెడితే జగన్ లోని ఒక కొత్త కోణం కడప జిల్లా పర్యటన సందర్భంగా ఆవిష్కృతం అయింది. జగన్ తన తాత రాజారెడ్డి పేరిట ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియంలో ఆటగాళ్ళ కోరిక మేరకు కొంతసేపు క్రికెట్ ఆడారు. జగన్ ప్రొఫెషనల్ ఆటగాడిగానే షాట్ కొట్టడం చూసి అక్కడ ఉన్నవారు కొంతసేపు షాక్ తిన్నారు. జగన్ పెర్ఫెక్ట్ గా బాల్ ని హ్యాండిల్ చేసి షాట్ కొట్టిన విధానం చూస్తూంటే మాత్రం ఆయనకు క్రికెట్ బాగా వచ్చు అని అంతా అనుకున్నారుట. బహుశా జగన్ కాలేజ్ డేస్ లో క్రికెట్ బాగా ఆడి ఉంటారని అంటున్నారు.

ఆనాడు అలా…?

ఇక జగన్ గతంలో విదేశాలకు వెళ్ళినపుడు గోల్ఫ్ ఆడి అందరికీ ఆశ్చర్యపరచారు. ఆయన మంచి ఆటగాడు అని అపుడు అందరూ అనుకున్నారు. ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. మరో సందర్భంలో ఆయన సీరియస్ గా చెస్ ఆడుతూ కనిపించారు. అంటే చదరంగంలో కూడా జగన్ కి మంచి పట్టు ఉందని కూడా తెలిసింది. మరి ఇలా ఎన్ని గేమ్స్ జగన్ కి వచ్చో అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. జగన్ ఎపుడూ తనకు ఇది వచ్చు అని ఎక్కడా చెప్పలేదు. ఆయన గురించి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇలా ఒక్కో కళా బయటపడుతూంటే చూసి తెలుసుకోవాల్సిందే.

ఆ మబ్బుతెరలేనా…?

జగన్ కంటే ముందే అవినీతి ఆరోపణల ముసుగు ఒకటి పెద్ద ఎత్తున మీద పడిపోయింది. దాంతో ఆయన అంటే ఏమిటో ఎవరికీ తెలియకుండా నిందలో నిష్టూరాలో జనంలోకి వెళ్ళిపోయాయి. దాని మీదనే చర్చ తప్ప జగన్ ఏంటి అన్నది ఎవరికీ తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. బహుశా జగన్ కూడా ఇలాంటి ప్రచారాన్ని చూసి వెక్స్ అయి తన గురించి తానే చెప్పుకోవాలా అన్న భావన‌నకు వచ్చేశారు అంటారు. ప్రతి మనిషిలోనూ లోపలి మనిషి ఉంటారు. ఎంత దగ్గర వారు అయినా నూరు శాతం అతని గురించి తెలుసుకోలేరు. అయితే మన పాలకులు, మనం అభిమానించే నేతల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. కొందరు నేతలు తమ గురించి ఎక్కువో తక్కువో చెప్పుకుంటారు. జగన్ మాత్రం తన చర్యలే తన గురించి చెప్పాలనుకుంటారు. మరి జగన్ లో ఉన్న మరిన్ని కోణాలను రానున్న రోజులలో అలా అయినా చూడగలుగుతామా. వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News