బీజేపీతో జగన్ డీల్ కుదిరిందా..?
రాష్ట్ర బీజేపీ వ్యూహం ఒక విధంగా ఉంటే.. కేంద్రంలోని బీజేపీ పెద్దల మాట మరో విధంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో పాగా వేయాలనేది నిన్న మొన్నటి [more]
;
రాష్ట్ర బీజేపీ వ్యూహం ఒక విధంగా ఉంటే.. కేంద్రంలోని బీజేపీ పెద్దల మాట మరో విధంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో పాగా వేయాలనేది నిన్న మొన్నటి [more]
రాష్ట్ర బీజేపీ వ్యూహం ఒక విధంగా ఉంటే.. కేంద్రంలోని బీజేపీ పెద్దల మాట మరో విధంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో పాగా వేయాలనేది నిన్న మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆశించారు.. ఇక, రాష్ట్ర నేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేడర్ ఉన్నా లేకున్నా.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేస్తామని వారు చెబుతున్నా రు. అయితే.. ఇప్పుడు కేంద్రంలో సమీకరణలు మారుతున్నాయి. మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. కానీ, అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ప్రాంతీయ పార్టీలను పట్టుకుని.. అవసరమైతే వారి మద్దతును కూడగట్టుకుని.. తాము కేంద్రంలోకి మరోసారి వచ్చేయాలని భావిస్తున్నారు. మరోవైపు థర్డ్ ఫ్రంట్ కూటమి కూడా బీజేపీ నేతలకు కంట్లో నలుసుగా మారింది.
ఏపీ మినహా….
కేసీఆర్ సహా కొందరు మహారాష్ట్ర, తమిళనాడు.. నేతలు.. థర్డ్ ఫ్రంట్‌పై సమీకరణలు చేస్తున్నారు. మమత, అఖిలేష్, మాయావతి కూడా ఈ వరుసలోనే ఉంటారు. అయితే.. ఈ క్రమంలో ఎక్కువగా ప్రజాదరణ ఉండి.. థర్డ్ ఫ్రంట్ జోలికి పోని.. దక్షిణాది రాష్ట్రం ఏపీ ఒక్కటే కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఆయనను, వైసీపీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే ఒక ప్రతిపాదన పంపినట్టు తెలుస్తోంది.
జగన్ ను కలుపుకుపోయేందుకు….
దీనిని బట్టి.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను తమతో కలుపుకొని ముందుకు సాగాలని.. ఎన్డీయేలో కలుపుకొని అవసరమైతే.. కేంద్రంలోనూ పదవులు ఇవ్వాలని.. హోదా తప్ప.. ఇతర హామీలపై సానుకూలంగా స్పందించాలని కూడా నిర్ణయించారు. ఈ నిర్ణయాల్లో బీజేపీ ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో మేం మీకు పోటీ రాం! అని నిర్ద్వంద్వంగా.. తేల్చి చెబుతున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని.. దీనికి జగన్ అనుకూలంగా వ్యవహరించారని వచ్చే ఎన్నికల్లో తనకు పోటీగా లేదా.. తన ప్రత్యర్థులతో బీజేపీ చేతులు కలపకపోతే.. వచ్చే ఎన్నికల్లో మోడీని తిరిగి పీఠం ఎక్కించేందుకు తాను కూడా సాయం చేస్తానని.. డీల్ కుదుర్చుకున్నట్టు చెబుతున్నారు.
గత ఎన్నికల్లోనూ…
అంటే.. ఏపీని మళ్లీ బీజేపీ జగన్ చేతుల్లో పెట్టేసినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లోనూ బీజేపీ జగన్‌కు సహకరించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి రెచ్చిపోతున్నారని.. తానే కేంద్రంలో అధికారంలో ఉన్నట్టు పీలవుతున్నారని.. అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.