రచ్చను ఫేస్ చేయాల్సిందే…. ?
జగన్ కి జనంలోకి రావాలన్న కోరిక బాగా ఎక్కువగా ఉంది. అవును నిజమే జగన్ రెండేళ్ళుగా అసలు ప్రజలలోకి వచ్చింది లేదు. రెండు సార్లు కరోనా రావడంతో [more]
;
జగన్ కి జనంలోకి రావాలన్న కోరిక బాగా ఎక్కువగా ఉంది. అవును నిజమే జగన్ రెండేళ్ళుగా అసలు ప్రజలలోకి వచ్చింది లేదు. రెండు సార్లు కరోనా రావడంతో [more]
జగన్ కి జనంలోకి రావాలన్న కోరిక బాగా ఎక్కువగా ఉంది. అవును నిజమే జగన్ రెండేళ్ళుగా అసలు ప్రజలలోకి వచ్చింది లేదు. రెండు సార్లు కరోనా రావడంతో చాలా కాలం గడచిపోయింది. దాంతో జగన్ రచ్చ బండ పేరిట జనాలలోకి వద్దామను కుంటున్నప్పటికీ అది ఎప్పటికపుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇపుడు జగన్ కుడి భుజమైన ఎంపీ విజయసాయిరెడ్డి దీని మీద సంచలనమైన విషయాలే చెప్పారు. చాలా తొందరలోనే జగన్ క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుడతారు అని ఎంపీ అంటున్నారు.
వస్తే మంచిదే ..?
జగన్ జనంలోకి రావడం మంచిదే. తాను ప్రతీ రోజూ అధికారులతో చేస్తున్న సమీక్షల ఫలితాలు ఏంటి అన్నది ఆయనకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అదే విధంగా తాను గొప్పగా ఊహించుకుని ప్రవేశపెట్టిన పధకాల తీరు తెన్నులను కూడా ఆయన స్వయంగా చూడవచ్చు, వాటి తప్పొప్పులు కూడా సమీక్ష చేయవచ్చు. మరో వైపు తాను లక్ష కోట్లకు పైగా వెచ్చించి పేదలకు నగదు బదిలీ చేశానని చెప్పుకుంటున్న నేపధ్యంలో వాటి తాలూకా ఫలితాలు ఎలా ఉన్నాయో జగన్ గమనించవచ్చు. అన్నింటి కంటే ముందు జగన్ కదిలితే మొత్తం ప్రభుత్వం కూడా కదులుతుంది కాబట్టి చాలా వరకూ సమస్యలకు అక్కడికక్కడ పరిష్కారం కూడా ఉంటుంది అని చెప్పాలి.
వాటి సంగతేంటి..?
ఏపీలో జగన్ సంక్షేమం మీదనే దృష్టి పెట్టారు. అభివృద్ధి అన్నది మరిచారు. దాంతో గ్రామాలలోకి జగన్ వస్తే మొదట వచ్చే ప్రశ్న అదే. దాని మీద జవాబుకు జగన్ తయారీగా ఉండాలి. అంతే కాదు జగన్ హయాంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఎదురు చూశారు. ఇపుడు జాబ్ క్యాలండర్ పేరిట తూతూ మంత్రంగా కొన్ని ఉద్యోగాలే భర్తీ చేస్తున్నారు. దాంతో వారంతా మండుతున్నారు. ఇపుడు జగన్ జిల్లా పర్యటనలు ఉంటే మాత్రం కచ్చితంగా వారి నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జగన్ రచ్చబండ వేదిక మీద ఉంటే రచ్చ చేయడానికి వీరు ఎదురుగానే ఉంటారని అంటున్నారు.
మ్యానేజ్ చేయాలి…?
జగన్ రచ్చ బండ అంటున్నారు. వాటికి వచ్చే జనాలు ఏ పార్టీయో ఎవరికీ తెలియదు. అక్కడ విపక్షానికి చెందిన వారు ఒకరిద్దరు ఉన్నా కూడా వారు చేసే రచ్చనే హైలెట్ చేయడానికి టీడీపీ అనుకూల మీడియా సిధ్ధంగా ఉంటుంది. గతంలో చంద్రబాబు జన్మభూమి పర్యటనల్లో ఇలాంటి వారే కొంత అల్లరి చేసేవారు. ఇపుడు జగన్ ని బదనాం చేయాలంటే ప్రతీ చోట రచ్చ చేసే చాలు అని విపక్షం అనుకుంటే మాత్రం జగన్ కి ఆ సెగలు తప్పకపోవచ్చు. మరో వైపు జల జగడాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి వాటి మీద కూడా ప్రశ్నలు వస్తాయి. కేవలం తాను అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకుని రచ్చబండను సక్సెస్ చేద్దామని జగన్ అనుకుంటే మాత్రం అది కష్టమే అవుతుంది అంటున్నారు. రెండేళ్ల పాలన పూర్తి అయింది కాబట్టి సహజంగానే జనంలో కొంత వ్యతిరేకత ఉంటుంది. వాటిని మ్యానేజ్ చేసుకుంటూ జనంలోకి వెళ్ళగలిగితేనే జగన్ రచ్చ బండ హిట్ అయ్యే సీన్ ఉంది అంటున్నారు.