జగన్ విషయంలో కేంద్రం నటిస్తోందా..?
ఏపీ సీఎం జగన్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నటిస్తోందా? జగన్‌కు అనుకూలంగా ఉన్నట్టు భావించేలా చర్యలు తీసుకుంటూనే.. జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తోందా ? [more]
;
ఏపీ సీఎం జగన్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నటిస్తోందా? జగన్‌కు అనుకూలంగా ఉన్నట్టు భావించేలా చర్యలు తీసుకుంటూనే.. జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తోందా ? [more]
ఏపీ సీఎం జగన్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నటిస్తోందా? జగన్‌కు అనుకూలంగా ఉన్నట్టు భావించేలా చర్యలు తీసుకుంటూనే.. జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తోందా ? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. మూడు రాజధానుల విషయంపై సీఎం జగన్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు జగన్ తీసుకున్న అనేక నిర్ణయాల్లో అత్యంత కీలకమైన రాజకీయ ప్రభావం చూపించే అంశాల్లో మూడు రాజధానులు అత్యంత ప్రధానమని భావిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం రోజుకో మాట మాట్లాడుతోంది.
మూడు రాజధానులకు….?
ఇటీవల మూడు రాజధానులకు అనుకూలంగా వ్యవహరించినట్టు కేంద్రం నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో వైసీపీ నేతలు అంతర్గతంగా సంబరాలు చేసుకున్నారు. మొత్తానికి మూడు రాజధానుల విషయంలో మన నేత పంతం నెగ్గింది అని కాస్త సంతోష పడ్డారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడం.. కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి.. మూడు రాజధానుల విషయం పరిశీలనలో ఉందని, ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో మళ్లీ విషయం మొదటికి వచ్చింది. మరోవైపు అప్పులు చేసుకునే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం జగన్ సర్కారు ను ఆటపట్టిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కొర్రీలు వేస్తూ…?
ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా బీజేపీ పాలిత, అనుకూల రాష్ట్రాలకు ఎంత అప్పయినా చేసుకునేందుకు అవకాశం ఇస్తున్న కేంద్రం ఏపీ విషయంలో మాత్రం ఇటీవల కాలంలో అనుకూలంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నా.. అప్పు విషయంలో ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. చివరకు ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేని విషయం అందరికీ తెలిసిందే. పోలవరంకు నిధులు లేవు సరికదా ? అనేక కొర్రీలు పడుతున్నాయి.
ఏ ఒక్క అభ్యర్థనను…
ఇప్పటి వరకు జగన్ చేసిన అభ్యర్థనల్లో ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. కేంద్రం పట్టించుకున్నట్టుగా వ్యవహరిస్తూనే. జగన్ ను పక్కన పెడుతోందని.. ఇప్పుడు జగన్ అవసరం ఉన్నందున.. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై వైసీపీ నేతలు ఏమీ మాట్లాడలేక పోతున్నారని అంటున్నారు. మరి ఇది మున్ముందు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో చూడాలి.