జగన్ చివరి ఛాన్స్ చంద్రబాబుకు ఇస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెండున్నరేళ్ల పాలన దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇక సమయం సగం మాత్రమే ఉంది. అంటే ఎన్నికల ఏడాదిని లెక్కలోకి తీసుకోలేం. గట్టిగా ఒకటిన్నర [more]

Update: 2021-08-15 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెండున్నరేళ్ల పాలన దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇక సమయం సగం మాత్రమే ఉంది. అంటే ఎన్నికల ఏడాదిని లెక్కలోకి తీసుకోలేం. గట్టిగా ఒకటిన్నర సంవత్సరం జగన్ ముఖ్యమంత్రిగా తన పాలన ఏంటో చూపాల్సి ఉంది. ఇప్పటి వరకూ అయితే జగన్ పాలనకు కు ఫిఫ్టీ ఫిఫ్టీగా మార్కులు వేస్తున్నారు. సంక్షేమం తప్ప అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి లేదన్న విమర్శలు దాదాపు ప్రతినోటా విన్పిస్తున్నాయి.

ఏడాదిన్నర మాత్రమే…?

ఇక ఒకటిన్నర ఏడాదిలో జగన్ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేవిధంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కరోనా కారణంగా దాదాపు ఒకటిన్నర ఏడాది పాలన క్యాంప్ కార్యాలయానికే పరిమితమయింది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్నది ఆయనకు స్పష్టంగా తెలియడం లేదు. సీఎంవో అధికారులు సయితం జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే గట్టెక్కిస్తాయన్న నమ్మకం సరికాదంటున్నారు.

మూడు రాజధానులు….

ఈ ఒకటిన్నర సంవత్సరంలో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను గ్రౌండ్ చేయాల్సి ఉంటుంది. అంటే విశాఖలో పరిపాలన రాజధాని ప్రారంభించాలి. కర్నూలులో న్యాయరాజధానికి శ్రీకారం చుట్టాలి. కానీ న్యాయపరమైన ఇబ్బందులున్నాయి. ఇది సాధ్యం కాకపోతే జగన్ మూడు ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పవు. ఐదేళ్లలో చేసిందేమిటన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. దీంతో పాటు ఎన్నికల హామీల్లో ముఖ్యమైనది మద్యపాన నిషేధం.

మద్యపాన నిషేధం…..

మద్యపాన నిషేధాన్ని వీలయినంత త్వరగా జగన్ అమలు పర్చాలి. ఎన్నికలకు ముందు అమలుపరిస్తే జనం నమ్మరు. ఇప్పుడు అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. అందుకే మద్యపాన నిషేధం హామీ విషయంలో జగన్ దొరికిపోయే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఒకటిన్నర ఏడాదిలో అభివృద్ధితో పాటు పారిశ్రామిక ప్రగతిని చూపించి, మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తేనే జగన్ కు మరోసారి అవకాశాలున్నాయన్నది సుస్పష్టం. లేకుంటే చివరి ఛాన్స్ గా చంద్రబాబు కొట్టేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.

Tags:    

Similar News