వాళ్లను జైలుకు పంపడమే.. తర్వాత మామూలేనా?
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేతలపై అనేక కేసులు నమోదయ్యాయి. అయితే ఏఒక్కటీ ప్రూవ్ కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెండున్నరేళ్లలో జగన్ ప్రభుత్వంలో సీఐడీ, ఏసీబీ [more]
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేతలపై అనేక కేసులు నమోదయ్యాయి. అయితే ఏఒక్కటీ ప్రూవ్ కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెండున్నరేళ్లలో జగన్ ప్రభుత్వంలో సీఐడీ, ఏసీబీ [more]
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేతలపై అనేక కేసులు నమోదయ్యాయి. అయితే ఏఒక్కటీ ప్రూవ్ కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెండున్నరేళ్లలో జగన్ ప్రభుత్వంలో సీఐడీ, ఏసీబీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. టీడీపీ ముఖ్యనేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. వాళ్లు బెయిల్ పై జైలుకు వెళ్లి తిరిగి వచ్చారు. కానీ ఆరోపణలకు తగిన ఆధారాలను చూపించడంలో ఈ రెండు దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయన్న చర్చ జరుగుతోంది.
ఈఎస్ఐ స్కామ్ లో….?
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. దాదాపు నెల రోజులకు పైగానే ఆయన కస్టడీలో ఉండి బెయిల్ పై బయటకు వచ్చారు. ఈఎస్ఐ స్కామ్ లో ఇప్పటి వరకూ ఆధారాలను దర్యాప్తు సంస్థ సమర్పించలేకపోయింది. ఈఎస్ఐ కేసులో వందల కోట్ల అవినీతి జరిగిందని, అచ్చెన్నాయుడు నిందితులకు అనుకూలంగా సంతకాలు చేశారని వైసీపీ ఆరోపించింది. కానీ ఇప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించిన పురోగతి లేకుండా పోయింది.
రాజధాని భూ దందా కేసులోనూ?
ఇక అతిపెద్ద స్కామ్ అని వైసీపీ చెప్పే అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో కూడా సరైన సాక్ష్యాధారాలను సేకరించడంలో దర్యాప్తు సంస్థ విఫలమయిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. దళితులకు చెందిన అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొనుగోలు చేశారన్న ఆరోపణలపై ఇప్పటికీ దర్యాప్తు సాగుతూనే ఉంది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ, చంద్రబాబులను నిందితులుగా చేర్చి కేసు నమోదు చేసినా కోర్టు ఆదేశాలతో అరెస్ట్ వరకూ వెళ్లలేదు. దర్యాప్తు మాత్రం ఇంకా నత్త నడకన సాగుతూనే ఉంది.
సంగం డెయిరీ విషయంలో..?
ఇక సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆయన జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. సంగం డెయిరీ కేసులో కూడా ఎటువంటి ఆధారాలను సేకరించలేక దర్యాప్తు సంస్థలు చతికల పడ్డాయన్న విమర్శలున్నాయి. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకల కేసును కూడా సీఐడీకి ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆరోపణలకు తగిన ఆధారాలను చూపించలేకపోవడం, న్యాయస్థానాల్లో నిరూపించలేకపోవడం వంటివి జగన్ సర్కార్ ప్రతిష్టను దెబ్బతీస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.