వైసీపీలో మరో అశోక్ బాబు… ?

పరుచూరి అశోక్ బాబు. టీడీపీ ఎమ్మెల్సీ. ఆయన దానికి ముందు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు. సమైక్యాంధ్రా ఉద్యమాన్ని తెలివిగా టీడీపీకి అనుకూలంగా తిప్పడంతో ఘనత వహించిన [more]

;

Update: 2021-07-17 11:00 GMT

పరుచూరి అశోక్ బాబు. టీడీపీ ఎమ్మెల్సీ. ఆయన దానికి ముందు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు. సమైక్యాంధ్రా ఉద్యమాన్ని తెలివిగా టీడీపీకి అనుకూలంగా తిప్పడంతో ఘనత వహించిన అశోక్ బాబు నవ్యాంధ్రాలో చంద్రబాబు తొలి సీఎం అయ్యేందుకు కూడా యధాశక్తి కృషి చేశారు. దాని ఫలితంగా ఆయన పదవీ విరమణ చేసిన వెంటనే ఎమ్మెల్సీ అయిపోయారు. అంటే ఉద్యోగుల నేతగా ఉంటూ రాజకీయాల్లో రాణించిన నేతగా అశోక్ బాబు ముందు వరసలో ఉన్నారన్న మాట. ఇప్పటికీ ఆయన వర్గం ఒకటి ప్రభుత్వ ఉద్యోగులలో ఉంది. అలా టీడీపీకి ఆయన సేవలు అందిస్తున్నారు.

దూరం పెరిగిందా …?

జగన్ రావాలి, ఆయన కావాలి అంటూ అతి ఉత్సాహం చూపిన వారిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను కూడా చెప్పుకోవాలి. జగన్ వస్తే చాలు తాము కూడా సూపర్ పవర్ సెంటర్లు అయిపోయినట్లే అని వారు భావించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చారు కానీ వారి ఆశలు ఏవీ నెరవేరలేదు. ప్రధాన డిమాండ్ అయిన సీపీఎస్ రద్దు అలాగే ఉండిపోయింది. మరో వైపు పీయార్సీ కూడా లేదు. డీఏలు అన్నవి గాలికి కొట్టుకుపోయాయి. అఖరుకు పరిస్థితి ఎంతదాకా వచ్చిందంటే ప్రతీ నెలలో ఒకటో తేదీన రావాల్సిన జీతాలు కూడా రావడంలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కార్ మీద ఒక్క లెక్కన మండిపోతున్నారు.

ఆయనే దిక్కు ….?

ఈ నేపధ్యంలో ప్రభుత్వ ఉద్యోగులను మంచి చేసుకోవడానికి జగన్ సర్కార్ కొత్త ఆలోచనలు చేస్తోంది. గతంలో ఏపీ ఎన్జీవోల సంఘం ప్రెసిడెంట్ గా పనిచేసిన చంద్రశేఖరరెడ్డిని తెచ్చి ఒక కీలకమైన ప్రభుత్వ పదవిలో నియమించబోతోందిట. ఆయను అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు అనుసంధానకర్తగా చేయాలని చూస్తోందిట. ఉద్యోగులలో మంచి పేరున్న ఆయన కనుక కోర్డినేషన్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులతో దూరం తగ్గుతుందని కూడా ఆశిస్తోంది. అలాగే ప్రభుత్వ సమస్యలు వారికి వివరించి దారికి తెచ్చుకోవడానికి కూడా ఈ పదవి ఉపయోగపడుతుంది అంటున్నారు.

ఆ ప్లేస్ లో కూడా …?

అదే విధంగా ఆయన్ని ఎమ్మెల్సీని కూడా చేయడానికి జగన్ సర్కార్ ఆలోచిస్తోంది అంటున్నారు. రాయలసీమలో మరో 20 నెలల తరువాత ఖాళీ అవబోతున్న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ సీటు నుంచి పోటీ చేయించడం ద్వారా పెద్దల సభలో కూర్చోబెట్టాలను కుంటోందిట. ఈ విధంగా ఇటు ఉద్యోగ సంఘాలతో సయోధ్యను కోరుకుంటూనే అటు సమర్ధుడైన చంద్రశేఖరరెడ్డి సేవలను వాడుకోవాలని వైసీపీ పెద్దలు చూస్తున్నారుట. చంద్రశేఖర్ రెడ్డి ద్వారా అశోక్ బాబు లాంటి వారికి చెక్ పెట్టాలని కూడా ఆలోచిస్తున్నారుట. మొత్తం మీద ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వైసీపీ వేసిన ఈ వ్యూహం బ్రహ్మాండంగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News