నమ్ముకున్నోడికి ఇక తిరుగులేదు

నిజం.. జగన్ ను నమ్మకుంటే అంతే. ఏదో ఒక పదవి. కాస్త లేటయినా రాకతప్పదు. ఈరోజు నామినేటెడ్ పదవులను భర్తీ చేసినప్పుడు అదే విషయం మరోసారి స్పష్టమయింది. [more]

Update: 2021-07-17 09:30 GMT

నిజం.. జగన్ ను నమ్మకుంటే అంతే. ఏదో ఒక పదవి. కాస్త లేటయినా రాకతప్పదు. ఈరోజు నామినేటెడ్ పదవులను భర్తీ చేసినప్పుడు అదే విషయం మరోసారి స్పష్టమయింది. అందుకే జగన్ తో ఒకసారి షేక్ హ్యాండ్ ఇస్తే ఇక షేక్ అవ్వదు. వైసీపీలో ఇప్పుడు అదే మాట విన్పిస్తుంది. ఎవరినీ సంప్రదించలేదు. తానే నివేదికలను జిల్లాల నుంచి తెప్పించుకుని పదవులను భర్తీ చేశారు. ఒకేసారి 135 కార్పొరేషన్లకు ఛైర్మన్ పదవులు జగన్ ఇచ్చారు.

అందరినీ అందలం….

వీరిలో 76 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకకు, 59 మంది అగ్రవర్ణాలకు జగన్ కేటాయించారు. ఇందులో మరో ప్రాధాన్యత ఏంటంటే 56 శాతం మంది మహిళలు వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు అయ్యారు. జగన్ తనను వెన్నంటి ఉన్న వారిని విస్మరించలేదు. వారిని సమయం వచ్చినప్పుడు అందలం ఎక్కించేందుకు సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామం పార్టీలో నేతలకు మరింత విశ్వాసం పెంచుతుంది. పార్టీ గడప దాటేందుకు కూడా నేతలు వెనకాడతారు.

పోటీ చేసి ఓటమి పాలయి….

అక్రమాని విజయనిర్మల పోటీ చేసి ఓటమి పాలయినా వైసీపీనే నమ్ముకుని ఉండటంతో ఆమెకు విశాఖపట్నం మెట్రో అధారిటీ ఛైర్మన్ గా నియమించారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి పనిచేసిన మాజీ ఎమ్మెల్యే నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు మెట్టు గోవిందరెడ్డి, మళ్ల విజయప్రసాద్ లను కార్పొరేషన్ ఛైర్మన్లు చేశారు. పెద్దాపురం వైసీపీ ఇన్ ఛార్జి దవులూరి దొరబాబుకు కూడా అవకాశం దక్కింది. రాజోలులో పోటీ చేసి ఓటమి పాలయిన బొంతు రాజేశ్వరరావును కూడా జగన్ అక్కున చేర్చుకున్నారు.

ప్రతి జిల్లాకు…?

ఇదే కాదు ప్రతి జిల్లాలో ప్రాధాన్యత ఉండేలా జగన్ జాగ్రత్తలు వహించారు. నందికొట్కూరులో పార్టీని విజయపథాన నడిపించిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్ ను చేశారు. పార్టీనే నమ్ముకుని జెండా పట్టుకుని తిరిగిన అడపా శేషుకు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ ను చేశారు. హిందూపురంలో ఫ్యాన్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నవీన్ నిశ్చల్ కు కూడా పదవి ఇచ్చారు. ఇందులో తమకు పదవి వస్తుందని ఊహించలేదు కూడా. అయినా కొన్ని వారాల పాటు కసరత్తులు చేసి మరీ ఒకేసారి 135 కార్పొరేషన్ల ఛైర్మన్లను నియమించడం సాధారణ విష‍యం కాదు. అందుకే జగన్ ను నమ్ముకుంటే తిరుగులేదు అన్నది వైసీపీలో బలంగా వినిపిస్తుంది.

Tags:    

Similar News