జగన్ మంత్రివర్గంలోనూ సమూల మార్పులు… సంకేతం ఇదేనా?

ఒక విషయం మాత్రం అర్థం అయింది. జగన్ తాను అనుకున్నది చేస్తాడు. తనను నమ్ముకున్న వాళ్లకు పదవులు ఇస్తాడు. రేపు మంత్రివర్గ విస్తరణలోనూ ఇదే జరగనుంది. నామినేటెడ్ [more]

;

Update: 2021-07-19 05:00 GMT

ఒక విషయం మాత్రం అర్థం అయింది. జగన్ తాను అనుకున్నది చేస్తాడు. తనను నమ్ముకున్న వాళ్లకు పదవులు ఇస్తాడు. రేపు మంత్రివర్గ విస్తరణలోనూ ఇదే జరగనుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసిన విషయంలో జగన్ పాటించిన సూత్రాలన్నీ మంత్రి వర్గ విస్తరణలోనూ ఉండనున్నాయి. ఆశావహులు ఇబ్బంది పడాల్సిన అవసరంలేదు. జగన్ గుడ్ లుక్స్ లో ఉండి, పార్టీ కోసం శ్రమించి ఉంటే కేబినెట్ పదవి దానంతట అదే వస్తుందని చెప్పవచ్చు.

మాట తప్పకుండా…?

నామినేటెడ్ పోస్టులు 135 భర్తీ చేసినా ఎక్కడా జగన్ మాట తప్పని విధంగా వ్యవహరించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఒక శాతం మాత్రమే పదవులు ఇచ్చారు. తొలి నుంచి పార్టీని నమ్ముకుని, తన వెంట నడిచిన వారికి ఎక్కువ మందికి చోటు కల్పించారు. జగన్ ఈసారి మంత్రి వర్గ విస్తరణలోనూ ఇదే రకంగా వ్యవహరించనున్నారన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది. మరో నాలుగైదు నెలల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది.

ఉత్కంఠ పడే వారికి ఊరట….

ఈ విస్తరణలో తమకు అవకాశం దక్కుతుందా? లేదా? అని అనేక మంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. టెన్షన్ పడే వారికి మాత్రం నామినేటెడ్ పోస్టుల భర్తీ కొంత ఊరటనిచ్చింది. ఎందుకంటే తమ శ్రమ, ఇచ్చిన మాటను జగన్ తప్పరన్న విశ్వాసం వారిలో ఇప్పుడు వ్యక్తమవుతుంది. మర్రి రాజశేఖర్ వంటి వారిని జగన్ పక్కన పెట్టారన్న విమర్శలున్నాయి. మర్రి రాజశేఖర్ ను కూడా ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఎక్కువగా కనపడుతుంది.

గతంలో ఛాన్స్ దక్కని….

అలాగే తొలిసారి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన సమయంలో అనేక మంది అసంతృప్తికి గురయ్యారు. అయితే సామాజికవర్గాల సమీకరణాల కారణంగా ఇవ్వలేకపోయామని జగన్ చెప్పారు. కానీ ఈసారి తనతో పాటు పార్టీ కోసం కష్టపడిన వారిలో ఎక్కువ మందికి మంత్రి పదవులు దక్కే ఛాన్సుంది. జగన్ ఇప్పటికే లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారని తెలుస్తోంది. ఎన్నికల టీమ్ గా వీరితోనే వెళ్లాలని జగన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. మొత్తం మీద నామినేటెడ్ పోస్టుల భర్తీ తర్వాత మంత్రి వర్గంలో చోటు కోసం ఆశిస్తున్న వారి మొహాల్లో వెలుగు కనపడుతుంది.

Tags:    

Similar News