జగన్ కంటే షర్మిలే సో బెటర్… ?
ఇద్దరూ వైఎస్సార్ బిడ్డలే. ఇద్దరూ ఆయన రక్తమే కానీ చాలా విషయాల్లో మాత్రం తేడాలు ఉన్నాయనే చెబుతారు. జగన్ ఇంట్రావర్ట్ అంటారు. అదే షర్మిలను తీసుకుంటే కలుపుగోలుతనానికి [more]
;
ఇద్దరూ వైఎస్సార్ బిడ్డలే. ఇద్దరూ ఆయన రక్తమే కానీ చాలా విషయాల్లో మాత్రం తేడాలు ఉన్నాయనే చెబుతారు. జగన్ ఇంట్రావర్ట్ అంటారు. అదే షర్మిలను తీసుకుంటే కలుపుగోలుతనానికి [more]
ఇద్దరూ వైఎస్సార్ బిడ్డలే. ఇద్దరూ ఆయన రక్తమే కానీ చాలా విషయాల్లో మాత్రం తేడాలు ఉన్నాయనే చెబుతారు. జగన్ ఇంట్రావర్ట్ అంటారు. అదే షర్మిలను తీసుకుంటే కలుపుగోలుతనానికి పెట్టింది పేరుగా ఉంటారు అని చెబుతారు. వైఎస్సార్ లో ఉన్న అరుదైన ఈ వ్యక్తిత్వం కుమార్తె షర్మిలకు వచ్చింది అంటారు. జగన్ కి ఈ కలివిడితనం రాలేదు అని కూడా దగ్గర నుంచి చూసిన వారు అనే మాట. జగన్ కాంగ్రెస్ ని వీడి ఈ రోజున అధికారలోకి వచ్చేంతవరకూ షర్మిలలోని ఈ రకమైన ఫ్రెండ్లీ నేచరే ఆ పార్టీకి శ్రీరామరక్షగా ఉందని కూడా విశ్లేషిస్తారు.
మీడియాతో అలా..?
షర్మిల ఎపుడూ దేనికీ భయపడే రకం కాదని ఇప్పటికే రుజువు చేసుకున్నారు. ఆమె ఆడపులిగానే రాజకీయాల్లో ఉంటున్నారు. పురుషాధిపత్యం ఎక్కువగా ఉన్న పాలిటిక్స్ లో ఆమె నెట్టుకురావడానికి ఈ క్వాలిటీసే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని అంటున్నారు. ఆమె ఈ మధ్య హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఆమెను టార్గెట్ చేస్తూ కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఎంతో ఓపికగా ఆమె జవాబు చెప్పడం విశేషం. అందులో జగన్ తో విభేదాలు కానీ, ఆమె మతం గురించి కానీ, తెలంగాణాలో పార్టీ పెట్టడం, తెలంగాణా వాదం వంటి వాటికి షర్మిల చక్కగా తన వాదన వినిపించారు. మీడియాను బాగా కన్వీన్స్ చేయగలిగారు. ఎక్కడా ఆమె తప్పించుకోవాలని కానీ ఆ ప్రశ్నలు వద్దని కానీ చూడలేదు. ఈ నేచర్ వైఎస్సార్ ది అని చాలా మంది అంటారు.
యాంటీ మీడియా..?
జగన్ స్వతహాగా మీడియా అధిపతి అయి ఉండి కూడా మీడియా కు బహు దూరంగా ఉంటారు. ఆయన ఒక పట్టాన బయటపడరు. ఆయన మొత్తం పొలిటికల్ కెరీర్ లో పట్టుమని అరడజన్ మీడియా మీట్లు కూడా నిర్వహించి ఉండరు. ఇక జగన్ మీడియాను అడ్రెస్ చేసే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ఆయన చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారు తప్ప మీడియా ప్రశ్నలను అసలు ఫేస్ చేయరు. వారు ఏ రకమైన ప్రశ్నలు అడుగుతారో ఈ తలకాయ నొప్పి ఎందుకు అన్నది జగన్ ధోరణి. ఆ విధంగా చూస్తే జగన్ మీద యాంటీ మీడియా ముద్ర బలంగా పడిపోయింది. ఇక నేతలతో కూడా ఆయన అంతగా కలుపుగోలుతనంగా ఉండరనే అంటారు.
మార్చుకోవాల్సిందే ..?
మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ఎవరి ప్రైవేట్ లైఫ్ వారిదే. కానీ వారు కనుక ఒక్కసారి పబ్లిక్ లైఫ్ లోకి ఎంటర్ అయితే జనాలు ఏమైనా అడుగుతారు. దానిని ఫేస్ చేయాల్సిందే. అంతా అనుకూలమే ఉండదు. రాజకీయంగా ఎంతో ఎదిగిన జగన్ ఈ విషయంలో మాత్రం చెల్లెలు కంటే కూడా వెనకబడే ఉన్నారు అన్నది వైసీపీ లోపలా బయటా కూడా ఒక్కటే మాట. ఎవరైనా కూడా రాణించాలనుకుంటే పబ్లిక్ తో కాంటాక్ట్స్ చాలా అవసరం. దానిని అనుసంధానం చేసేది మీడియా. జగన్ ఎందుకో మీడియాను దూరం పెట్టడం మాత్రం ఆ పార్టీ నేతలకు కూడా నచ్చదు అంటారు. జగన్ తన తీరు మార్చుకుంటే ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్తారని అంటున్నారు. మొత్తానికి షర్మిల పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిగా అవతరించాక ఈ పోలిక వచ్చింది. ముందు ముందు అన్నా చెల్లెళ్ళ మధ్య మరెన్ని పోలికలు తీస్తారో చూడాలి.