అడుగులో అడుగు వేసినా ఆయనను పట్టించుకోలేదట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక రాజకీయ ప్రయోజనం ఉండేలా చూసుకుంటారు. అందరినీ సంతృప్తి పరిచేలా నిర్ణయం ఉంటంది. కష్ట కాలంలో [more]

Update: 2021-08-03 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక రాజకీయ ప్రయోజనం ఉండేలా చూసుకుంటారు. అందరినీ సంతృప్తి పరిచేలా నిర్ణయం ఉంటంది. కష్ట కాలంలో తన వెంట నడిచిన వారికి జగన్ మరింత ప్రాధాన్యత ఇస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం మరింత స్పష్టమయింది. అయితే ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లో కొందరిని కావాలనే పక్కన పెట్టారా? లేక వారికి భవిష్యత్ లో పదవులు ఇద్దామని సైడ్ చేశారా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది.

వెంటే నడిచినా…?

ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబాన్ని జగన్ పట్టించుకోలేదన్న విమర్శ లున్నాయి. విశ్వేశ్వర్ రెడ్డి తొలి నుంచి జగన్ అడుగులో అడుగు వేస్తూ తిరిగారు. 2014 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ను ఓడించి, టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు లోనుకాకుండా జగన్ వెంటే నిలిచారు. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా జగన్ వేవ్ వీచినా ఉరవకొండలో మాత్రం అది కన్పించలేదు. విశ్వేశ్వర్ రెడ్డి పయ్యావుల కేశవ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

రెండు గ్రూపులు….

ఇక అప్పటి నుంచి ఉరవకొండ కు వైసీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వైసీపీలో రెండు గ్రూపులున్నాయి. విశ్వేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇది విశ్వేశ్వర్ రెడ్డికి తలనొప్పిగా మారింది. అనేక సార్లు రెండు వర్గాలు బాహాబాహీకి తలపడ్డాయి. అధిష్టానం జోక్యం చేసుకున్నా పరిస్థితి ఏ మాత్రం కంట్రోల్ కాలేదు. దీంతో ఒకింత ఈనియోజకవర్గంపై జగన్ సీరియస్ గానే ఉన్నారని తెలిసింది.

ఎమ్మెల్సీ పదవి కూడా…?

గత ఎన్నికల్లో ఓటమి పాలయిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో దాదాపు అందరికీ నామినేటెడ్ పోస్టులను జగన్ కేటాయించారు. కానీ విశ్వేశ్వర్ రెడ్డి ఫ్యామిలలో మాత్రం ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అలాగని ఈయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కూడా కష్టమే. సామాజికవర్గం పరంగా చూసుకున్నా విశ్వేశ్వర్ రెడ్డికి భవిష్యత్ లో ఎలాంటి పదవులు దక్కే అవకాశాలు లేవంటున్నారు. వచ్చే ఎన్నికల వరకూ పోటీ కోసం ఆయన వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News