జగన్ చేతిలో మంత్రదండం … ?
జగన్ రెండేళ్ల పై చిలుకు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారు. ఈ రోజు వరకూ చూస్తే ఆయన తాను ఇచ్చిన అన్ని హామీలనూ నిలబెట్టుకున్నారు. తాను చెప్పిన ప్రకారం [more]
;
జగన్ రెండేళ్ల పై చిలుకు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారు. ఈ రోజు వరకూ చూస్తే ఆయన తాను ఇచ్చిన అన్ని హామీలనూ నిలబెట్టుకున్నారు. తాను చెప్పిన ప్రకారం [more]
జగన్ రెండేళ్ల పై చిలుకు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారు. ఈ రోజు వరకూ చూస్తే ఆయన తాను ఇచ్చిన అన్ని హామీలనూ నిలబెట్టుకున్నారు. తాను చెప్పిన ప్రకారం కోటిన్నర కుటుంబాలకి అలా నగదు బదిలీ చేసుకుంటూనే పోతున్నారు. సర్కారీ సొమ్ముతో ఓట్లు కొనుక్కుంటారా, మీ రాజకీయమే తప్ప మరేమీ పట్టవా అంటూ టీడీపీ బీజేపీ వంటి పార్టీలు గట్టిగా విమర్శలు చేస్తున్నా జగన్ లెక్కచేయడంలేదు. ఇక జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయి. 2019 లో బంపర్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చిన జగన్ ఈ రోజు దాకా జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయాలనే అందుకుంటున్నారు. ఆయనకు గట్టి పోటీ ఇవ్వడం మాట పక్కన పెడితే విపక్షం ఉనికి పోరుకే పరిమితం అవుతోంది. తాజాగా వచ్చిన ఏలూరు కార్పోరేషన్ రిజల్టు అదే చెబుతోంది.
కష్టమేనా…?
జగన్ అప్పులు చేసైనా అన్ని రకాలైన పధకాలు అమలు చేస్తున్నారు. దేశంలో కరోనా రెండు దఫాలుగా వచ్చి మొత్తం ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసి పారేసింది. అయినా కూడా జగన్ ఎక్కడా తగ్గడంలేదు. ఎంతటి వడ్డీలకైనా అప్పులు తెచ్చి పంచుతున్నారు. మరి జగన్ చేతిలో ఉన్న మంత్రదండం ఇదే. అది అత్యంత పవర్ ఫుల్ అని విపక్షాలు తెలుసుకునేసరికి రెండేళ్ల పుణ్యకాలం గడచిపోయింది. మరి జగన్ ని ఇలాగే వదిలేస్తే ఇంతే సంగతులు అన్న తత్వం కూడా విపక్షాలకు చాలా చక్కగా బోధపడిపోయింది. అందుకే ఇపుడు వరే రూట్లో జగన్ ని అడ్డుకోవడానికి చూస్తున్నారు అంటున్నారు.
అప్పు పుట్టకుండా….
జగన్ కి ఈ భూమి మీద ఒక్క పైసా కూడా అప్పు పుట్టకుండా చేయాలనే విపక్షాలు భావిస్తున్నాయి. ఇంతకాలం ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్న బీజేపీ కూడా ఇపుడు సీరియస్ గానే దృష్టి పెట్టింది అంటున్నారు. అందుకే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీని అప్పుల రాష్ట్రంగా పోలుస్తూ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ఏపీని నిండా ముంచేశారు అని కూడా ఆయన ఆరోపణలు చేశారు. కేంద్రానికి దీని మీద ఫిర్యాదులు చేస్తామని కూడా హెచ్చరించారు. బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ తాజా కామెంట్స్ బట్టి చూస్తే జగన్ కి ఉచ్చు బిగించడం ఖాయమే అన్న మాట వినిపిస్తోంది.
రివర్స్ కొడుతుందా…?
జగన్ కి అప్పు పుట్టక ఏపీలో బండి నడవకపోతే తీవ్రమైన అసంతృప్తి జనంలో నుంచి వస్తుందని బీజేపీ టీడీపీ వంటి పార్టీలు అంచనా వేస్తున్నాయి. జనాలు కూడా పధకాలు అమలు చేయకపోతే వైసీపీని వ్యతిరేకిస్తారు అని కూడా ఊహిస్తున్నారు. మరి ఈ విషయంలో రాజకీయంగా చేయడానికి ఏమీ ఉండదు కూడా. ఆర్ధికపరమైన విషయాలు జనాలకు అసలు పట్టవు. తమను కేంద్రం వేధిస్తోంది అని చెప్పుకోవడానికి కూడా ఆధారాలు ఉండవు. ఈ విధంగా జరిగితే జగన్ చేతులు కట్టేస్తే రానున్న కాలంలో ఇబ్బందుల్లో పడిపోతారా. పధకాలు ఇవ్వకుండా పోతే జనాలకు ఏమని జవాబు చెప్పుకుంటారు. ఇక జగన్ చేతిలో మంత్రదండాన్ని మాయం చేస్తే ఏపీలో విపక్షాలకు పట్టు దొరుకుతుందా. ఇవన్నీ ప్రశ్నలే. వీటికి సమాధానం కోసం వేచి చూడాల్సిందే