అందుకోసం జగన్ మాస్టర్ ప్లాన్ అదేనా …?

ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కి దిగిపోయింది. వైసిపి ఇస్తున్న సంక్షేమ పథకాలు సర్కార్ పాలన సక్రమంగా సాగకుండా అడ్డుపడుతున్నాయి. పులి మీద స్వారీ చేస్తున్న రీతిలో జగన్ [more]

;

Update: 2021-07-28 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కి దిగిపోయింది. వైసిపి ఇస్తున్న సంక్షేమ పథకాలు సర్కార్ పాలన సక్రమంగా సాగకుండా అడ్డుపడుతున్నాయి. పులి మీద స్వారీ చేస్తున్న రీతిలో జగన్ ఇప్పుడు వెనక్కి తగ్గలేరు. అలాగని పథకాల అమలు దినదినగండం గానే మారాయి. దాంతో ఆదాయాల సమీకరణ కోసం, అప్పుల కోసం జగన్ సర్కార్ చేయని ప్రయత్నం లేదు. అయితే అప్పులు సైతం ఏపీకి పుట్టకుండా కేంద్రం వెనకునుంచి చేయాలిసిందంతా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఆర్ధిక కష్టాల కడలి నుంచి గట్టెక్కించేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని వినిపిస్తున్నారు.

రియల్ రంగంలోకి సర్కార్ …

ఆర్ధిక కడగండ్ల నుంచి గట్టెక్కాలంటే ఎపి లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వమే చేయడం మంచిదనే ఆలోచనను ప్రభుత్వ ఆర్ధిక నిపుణులు సూచించారని అంటున్నారు. గతంలో నగరాలు, పట్టణాలు వంటి చోట హౌసింగ్ బోర్డు ల ద్వారా స్థలాలను సర్కార్ ఇచ్చేది. అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించడం తో అన్ని చోట్లా ఆ కాలనీలు ఒక పద్ధతిలో కనిపిస్తాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాను వినియోగించి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ధనిక వర్గాల వారికి స్థలాలను విక్రయించడానికి జగన్ సర్కార్ యోచన చేస్తుంది.

వెంచర్లు వేసి…

ఇప్పటికే పేదలకు ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ నిర్మాణం జగనన్న కాలనీల పేరిట ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సాగిస్తుంది. వీటితో పాటు ఏపీలోని నగరాలు పట్టణాల్లో ఉన్న భూమిని సేకరించి వెంచర్లు వేసి స్థలాలను విక్రయిస్తే భారీ ఎత్తున నిధుల సమీకరణ జరుగుతుందని ఇప్పటికే దీనికి సంబంధించి కార్యాచరణ జగన్ సర్కార్ మొదలు పెట్టినట్లు తాజాగా వచ్చిన ఆదేశాలు చెప్పక చెబుతున్నాయి. మరి జగన్ సర్కార్ కొత్త ప్లాన్ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News