అక్కడ ఎక్కువ పర్యటించండి…జగన్ వారికి ఆదేశాలు
బద్వేలు ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. ఈ ఏడాది మార్చి నెలలో వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది. దేశంలో అన్ని నియోజకవర్గాలకు [more]
బద్వేలు ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. ఈ ఏడాది మార్చి నెలలో వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది. దేశంలో అన్ని నియోజకవర్గాలకు [more]
బద్వేలు ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. ఈ ఏడాది మార్చి నెలలో వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది. దేశంలో అన్ని నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ఒకసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది. కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో త్వరలో బద్వేలు ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. అయితే ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య కుటుంబం నుంచే ఉంటారని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల జరిపిన సమీక్షలో….
ఇటీవల జగన్ బద్వేలుపై సమీక్ష జరిపారని తెలుస్తోంది. సీనియర్ నేతలతో జగన్ బద్వేలు ఉప ఎన్నికపై చర్చించినట్లు చెబుతున్నారు. బద్వేలు ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. జగన్ ఇప్పటికే బద్వేలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి వచ్చారు. తాను పర్యటించి వచ్చిన తర్వాత మంత్రులు కూడా నెలలో ఒకసారి బద్వేలులో పర్యటించాలని జగన్ ఆదేశించారని తెలుస్తోంది.
ఏకపక్షమైనప్పటికీ….
బద్వేలులో ఎన్నిక ఏకపక్షమైనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. బద్వేలు ఉప ఎన్నికకు ఇన్ ఛార్జిని త్వరలో నియమిస్తానని, అప్పటి వరకూ కడప జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి పర్యవేక్షించాలని జగన్ ఆదేశించారు. అంతే కాకుండా బద్వేలులో పార్టీ నేతలతో తరచూ సమావేశమై వారి సమస్యలపై చర్చించాలని కూడా జగన్ ఈ సమావేశంలో సూచించినట్లు చెబుతున్నారు.
మెజారిటీపైనే…?
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ అనేక కసరత్తులు చేస్తున్నారు. కానీ బద్వేలు విషయంలో జగన్ ధీమాగా ఉన్నప్పటికీ పోటీ అనివార్యమైతే మెజారిటీ గతంలో కంటే ఎక్కువ రావాలన్నది జగన్ ఆలోచన.ఉప ఎన్నిక ఏదైనా తన పాలనకు రిఫరెండంగా భావిస్తారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని, మంత్రులు తరచూ బద్వేలు పర్యటనలు చేపట్టాలని జగన్ ఆదేశించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలోనూ బద్వేలు ఉప ఎన్నిక వేడి మొదలయిందనే చెప్పాలి.