ముందుగానే చెప్పి మరీ ముగించేస్తారట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు కొందరు మంత్రులకు అప్పుడే సంకేతాలు వెళ్లాయని తెలుస్తోంది. కేబినెట్ నుంచి తప్పించే మంత్రులకు [more]

Update: 2021-08-15 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు కొందరు మంత్రులకు అప్పుడే సంకేతాలు వెళ్లాయని తెలుస్తోంది. కేబినెట్ నుంచి తప్పించే మంత్రులకు ముందుగానే తెలియపర్చాలని జగన్ అభిప్రాయపడుతన్నారట. ఎవరినీ పనితీరు ఆధారంగా పదవుల నుంచి తొలగించడం లేదని, కేవలం అందరీకి అవకాశం ఇవ్వాలన్న ఏకైక కారణంతోనే తప్పిస్తున్నామని మంత్రులతో జగన్ స్వయంగా చెప్పనున్నారని తెలిసింది.

మరికొద్ది నెలల్లోనే….

మరికొద్ది నెలల్లోనే జగన్ తన కేబినెట్ ను విస్తరించనున్నారు. ఇందుకోసం కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దాదాపు 95 శాతం మంది మంత్రులను కేబినెట్ నుంచి తప్పించే అవకాశముంది. వీరిలో కొందరికి పార్టీ పదవులు అప్పగించాలని జగన్ యోచిస్తున్నారని తెలిసింది. పార్టీలో ముఖ్యమైన పదవులను ఎంపిక చేసిన వారికి ఇవ్వాలన్నది జగన్ నిర్ణయంగా ఉంది. దీంతో పాటు కొన్ని జిల్లాల బాధ్యతలను కూడా మంత్రి పదవుల నుంచి తప్పించిన వారికి ఇచ్చే అవకాశముందట.

ఎందరికో ఆశలు….

జగన్ రెండేళ్ల క్రితమే చెప్పారు. ఈ మంత్రి వర్గం కేవలం రెండున్నరేళ్లు మాత్రమే ఉంటుందని, అందరికీ అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో మంత్రి వర్గ విస్తరణ కోసం అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. తమ సీనియారిటీ, సిన్సియారిటీని చూసి పదవి ఇస్తారని భావిస్తున్నారు. జగన్ కూడా అదే దిశగా ఆలోచన చేస్తున్నారని తెలిసింది. సామాజిక వర్గాలతో పాటు సిన్సియారిటీని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.

సీమలోనే ఇబ్బంది….

ముఖ్యంగా రాయలసీమలో జగన్ కు సామాజికపరంగా ఇబ్బంది తలెత్తుతుంది. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం నేతలు ఆశావహుల్లో ఎక్కువగా ఉన్నారు. దీంతో వీరిలో కొంతమందికి పార్టీ పదవులు ఇవ్వాలని, జిల్లాల ఇన్ ఛార్జులుగా నియమించాలన్న యోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. మంత్రి పదవి ఏ కారణం చేత ఇవ్వలేకపోయారో కూడా దక్కని వారికి ఈసారి జగన్ ముందుగానే వివరించే అవకాశముందట. మొత్తం మీద జగన్ కేబినెట్ కూర్పు కసరత్తు మొదలయిందట.

Tags:    

Similar News