తెలంగాణ నుంచి ఏపీకి స్థానికత కోసం వస్తున్నారా?

రాష్ట్రం విడిపోయి ఏడేళ్లవుతోంది. ఆంధ్రప్రదేశ్ కు వచ్చి స్థానికతను తీసుకోవాలని గతంలో చంద్రబాబు, ఇప్పడు జగన్ పిలుపునిస్తున్నారు. కానీ ఏడేళ్ల నుంచి ఏపీకి వచ్చిన వారు తక్కువమందేనంటున్నారు. [more]

;

Update: 2021-09-12 12:30 GMT

రాష్ట్రం విడిపోయి ఏడేళ్లవుతోంది. ఆంధ్రప్రదేశ్ కు వచ్చి స్థానికతను తీసుకోవాలని గతంలో చంద్రబాబు, ఇప్పడు జగన్ పిలుపునిస్తున్నారు. కానీ ఏడేళ్ల నుంచి ఏపీకి వచ్చిన వారు తక్కువమందేనంటున్నారు. అయితే ఇటీవల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు పెరగడం, జగన్ లబ్దిదారుల ఖాతాల్లోకి విడుదల చేస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రం తిరిగి ఏపీకి చేరుకుంటున్నారు.

ఈ ప్రాంత ప్రజలే…..

ఎక్కువగా ఉత్తరాంధ్ర, ప్రకాశం, రాయసీమ ప్రాంతాలకు చెందిన వారు ఇటీవల కాలంలో ఎక్కువ మంది వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో తెలంగాణలో ఉండి ఉపాధి పనుల కోసం వెళ్లిన వారు సయితం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ఇక్కడి స్థానికత కోసం తాహసిల్దార్ కార్యాలయాల వద్దకు వస్తున్నారు. ఇప్పటికే ఈ రెండేళ్ల కాలంలో దాదాపు లక్షకు పైగా కుటుంబాలు కొత్తగా స్థానికత కోసం దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్నారు.

బాబు హయాంలోనూ….

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో విద్యావంతులు, పారిశ్రామికవేత్తలను సయితం ఏపీకి ఆహ్వానించారు. ఏపీలో స్థానికతను సంపాదించుకునేందుకు డెడ్ లైన్ కూడా పెట్టారు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంలో వ్యాపారాల నిర్వహణ కష్టమని వారు భావించారు. పరిశ్రమలు పెద్దగా లేకపోవడంతో ఉపాధి అవకాశాల కోసం యువత కూడా ఎవరూ ఏపీ కి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు.

పేద, మధ్యతరగతి ప్రజలే…..

అయితే ఇప్పుుడు జగన్ హయాంలోనూ ఉద్యోగాల కోసం యువత అయితే పెద్దగా ఏపీకి రావడం లేదు. కేవలం పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రమే వస్తున్నారు. అదీ సంక్షేమ పథకాల కోసం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఉండటం, పిల్లల చదువులకు ప్రభుత్వం సాయం అందిస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు మళ్లీ ఏపీ వైపు పరుగులు తీస్తున్నారు. లక్ష కుటుంబాల వరకూ ఈ రెండేళ్లలో ఏపీకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Tags:    

Similar News