జగన్ ప్రభుత్వంపై నమ్మకం `రివర్స్`? ఏం జరిగిందంటే?
ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలపైనే ప్రజలకు, వ్యాపారులకు, వాణిజ్య వేత్తలకు నమ్మకం ఉంటుంది. ఈ విషయం ఎక్కడా తేడా లేదు. కొన్ని కొన్ని బడా వ్యాపార సంస్థలకు కూడా [more]
;
ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలపైనే ప్రజలకు, వ్యాపారులకు, వాణిజ్య వేత్తలకు నమ్మకం ఉంటుంది. ఈ విషయం ఎక్కడా తేడా లేదు. కొన్ని కొన్ని బడా వ్యాపార సంస్థలకు కూడా [more]
ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలపైనే ప్రజలకు, వ్యాపారులకు, వాణిజ్య వేత్తలకు నమ్మకం ఉంటుంది. ఈ విషయం ఎక్కడా తేడా లేదు. కొన్ని కొన్ని బడా వ్యాపార సంస్థలకు కూడా ప్రభుత్వాలే భరోసా ఇచ్చి.. హామీ ఇచ్చి.. ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకునేలా ఏర్పాట్లు చేస్తాయి. ఇక, తమ పరిధిలో వాటికి కూడా ఆయా ప్రభుత్వాలు అండగా ఉన్న పరిస్థితి ఉంది. అంటే.. ఇదంతా కూడా ప్రభుత్వాలపై నమ్మకంతోనే జరుగుతుంది. ప్రభుత్వాలు మారినా.. ఈ 'నమ్మకం' మాత్రం సడలకుండా ఉంటుంది. 'గవర్నమెంట్ గ్యారెంటీ ఉంటే.. ఇంకేంటి' అనే మాట సర్వత్రా వినిపిస్తూనే ఉంటుంది. అయితే.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విషయంలో ఇది 'రివర్స్' అయిందని అంటున్నారు.
బిల్లులు రాక…?
ఏపీలోని జగన్ ప్రభుత్వం ఇప్పుడు దేశంలోనే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అప్పులు లెక్కకు మించి తేవడంతో రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా మారిపోయింది. కేవలం సంక్షేమం కోసంపాకులాడుతున్న ప్రభుత్వం ఖజానా కొల్లబోతున్న విధానాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో చాలా పథకాలు.. నిలిచిపోతున్నాయి. మరీముఖ్యంగా ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు నిధులు చెల్లించలేక.. విలవిల్లాడుతున్నారు. ఇప్పటికీ కొన్ని పనుల్లో గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు జగన్ సర్కారు నిధులు చెల్లించలేదు. పోనీ.. దీనికి రాజకీయ కారణాలు ఉన్నాయని అనుకున్నా.. తాజాగా ప్రభుత్వం చేపట్టిన పనులకు కూడా కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించడం లేదు. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రెండేళ్లలో చేసిన కోట్లాది రూపాయల పనులకు సంబంధించిన బిల్లులకే దిక్కూ దివాణం లేకుండా పోయింది.దీంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు.
వారిని బుజ్జగించి మరీ…
ప్రభుత్వ పనులను చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో రోడ్లను బాగు చేసేందుకు జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లను పిలిచేందుకు సన్నద్ధమైంది. అయితే ఎవరూ కూడా ముందుకు రాలేదని అధికారులే చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు విషయం తెలుసుకున్న రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు.. కాంట్రాక్టర్లను బతిమాలినంత పనిచేశారు. బ్యాంకుల ద్వారా.. మీకు నిధులు ఇప్పిస్తామంటూ.. ఆయన వారిని బుజ్జగించే పనిచేపట్టారు. అంటే.. ప్రభుత్వం తరఫున పనిచేసిన కాంట్రాక్టర్లకు.. నేరుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించే పద్ధతిని పక్కన పెట్టి బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేస్తామని అన్నారు. నిజానికి ఈ విధానం.. ఏపీ చరిత్రలో ఇదే తొలిసారి. దీనిలో పారదర్శకత ఉంటుంది.. అందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందేమో.. అనుకుంటున్నారేమో.. అదేం కాదు.
ప్రాణసంకటమే…?
ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో కాంట్రాక్టులకు నిధులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో వీరికి ఇప్పుడు బ్యాంకుల ద్వారా హామీలు ఇప్పించి.. పనులు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే.. కృష్ణబాబు.. ఈ వ్యవహారంపై పెద్దగా దృష్టి పెట్టారు. కాంట్రాక్టర్లను బుజ్జగించే పనిచేపట్టారు. అయితే..దీనిపై సీనియర్ అధికారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం దివాలా తీసిందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇది జగన్ సర్కారుకు ప్రాణసంకటమనేని అంటున్నారు పరిశీలకులు.