జగన్ మీద డైరెక్ట్ అటాక్.. ?
మొత్తానికి ఇన్నాళ్ళూ ఒడిసిపట్టిన అసంతృప్తి బద్దలైంది. ఏ జగన్ అయితే రావాలి. కావాలి అంటూ గట్టిగా కోరుకున్నారో ఆ ఉద్యోగులే ఇపుడు ఏపీ సర్కార్ అంటే మండిపోతున్నారు. [more]
;
మొత్తానికి ఇన్నాళ్ళూ ఒడిసిపట్టిన అసంతృప్తి బద్దలైంది. ఏ జగన్ అయితే రావాలి. కావాలి అంటూ గట్టిగా కోరుకున్నారో ఆ ఉద్యోగులే ఇపుడు ఏపీ సర్కార్ అంటే మండిపోతున్నారు. [more]
మొత్తానికి ఇన్నాళ్ళూ ఒడిసిపట్టిన అసంతృప్తి బద్దలైంది. ఏ జగన్ అయితే రావాలి. కావాలి అంటూ గట్టిగా కోరుకున్నారో ఆ ఉద్యోగులే ఇపుడు ఏపీ సర్కార్ అంటే మండిపోతున్నారు. ఏపీ ఎన్జీవో సంఘం అయితే డైరెక్ట్ అటాక్ చేసేసింది. జగన్ సర్కార్ లో ఉద్యోగులకు నెల జీతాలే కరవు అంటూ ప్రెసిడెంట్ బండి శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. ఉద్యోగులకు ప్రతీ నెలా జీతాలు సకాలంలో చెల్లించేలా చూడాలని తాను ఏడుకొండలవాడిని కోరుకుంటున్నట్లుగా ఆయన చెప్పడం ద్వారా సర్కార్ పరువు తీసేశారు.
గతంలో లేదుట….
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల ఫస్ట్ తారీఖు అంటే పండుగ లాంటిది అని ఆయన అంటున్నారు. అలాంటి పండుగను తమకు లేకుండా ఏపీ సర్కార్ చేసిందని కూడా ఆయన విమర్శించారు. నాలుగు నెలలుగా జీతాలు సకాలంలో రాక ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు అంటే ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసినట్లే అనుకోవాలిగా. ఇక పెన్షన్లు కూడా ఒక జిల్లాలో పడుతూంటే మరో జిల్లాలో లేవు అంటే ఏమనుకోవాలని ఆయన నిలదీస్తున్నారు. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ఇప్పటికే 37 నెలలు ఆలస్యం అయిందని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రకటించినట్టుగానే రాష్ట్రంలోనూ ప్రకటించాలన్ని, ఇక తాము ఈ విషయంలో ఆగే ప్రసక్తి లేదని కూడా ఆయన స్పష్టం చేయడం బట్టి చూస్తూంటే జగన్ సర్కార్ కి డెడ్ లైన్ విధంచారు అనుకోవాలిగా.
సలహా ఇచ్చేశారు….
మీరు ఏం చేసుకుంటారో మాకు తెలియదు, మాకు మాత్రం నెల జీతాలు సకాలంలో ఇవ్వాల్సిందే అంటూ గట్టిగానే చెప్పేశారు ఎపీ ఎన్జీవో నేత. అంతే కాదు, ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించేలా ఆర్ధిక వనరులు సమకూర్చుకోవాలని కూడా ఆయన సలహా ఇవ్వడమే ఇక్కడ విశేషం. ఇవన్నీ చూస్తూంటే జగన్ సర్కార్ కి అసలైన కష్టాలు మొదలైనట్లుగానే భావించాలి. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు వివిధ రకాలుగా మదన పడుతున్నప్పటికీ ఇంత స్ట్రాంగ్ గా మాత్రం ఎవరు బయటపడి మాట్లాడలేదు. ఇపుడు ఎన్జీవోలు బయట పడ్డారు, రేపు మిగిలిన వారు కూడా వస్తారు అంటున్నారు. ఒకవైపు తన హామీలను తీర్చేందుకు ఎక్కడ లేని డబ్బులను తెచ్చి గుమ్మరిస్తున్న జగన్ ప్రభుత్వం అనే రధానికి చక్రాలుగా ఉన్న ఉద్యోగుల విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తే ఎలా అన్న మాట సొంత పార్టీ నుంచి కూడా ఉంది. జగన్ ఈ విషయంలో ఇకనైనా మేలుకోకపోతే పంచుడు కార్యక్రమం వల్ల వచ్చే ఓట్ల సంగతేంటో కానీ ఉద్యోగులతో వైరం వల్ల కొరివితో తలగోక్కోవడమే అవుతుంది అంటున్నారు.