జగన్ లో అందుకే ఆ అసహనం… ?

జగన్ లో ఆవేశం ఉంది. అదే ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది. జగన్ కోపాన్ని కూడా విజయానికి సోపానంగా మారుచుకున్నారు. ఆయన తన కాళ్ళు తనవి [more]

;

Update: 2021-07-30 15:30 GMT

జగన్ లో ఆవేశం ఉంది. అదే ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది. జగన్ కోపాన్ని కూడా విజయానికి సోపానంగా మారుచుకున్నారు. ఆయన తన కాళ్ళు తనవి కాదనుకుని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఎండకు ఎండి వానకు తడిసి మొత్తానికి జనాలకు చేరువ అయ్యారు. వారి ఆశీస్సులతో అధికారాన్ని అందుకున్నారు. రెండేళ్ళ పాలన ముగిసింది. జగన్ సమీక్షలకే పరిమితం అయ్యారు. ఏపీలో ఏం జరుగుతోంది అన్నది తెలియడంలేదు. లోకల్ బాడీ ఎన్నికలు అయినా మరేవైనా వైసీపీ గెలుస్తోంది. దానికి అధికారంలో ఉండడం కూడా అతి పెద్ద అడ్వాంటేజ్. అందువల్ల జనం గురించి తెలియాలి అంటే క్షేత్ర స్థాయిలోకి వెళ్ళాలి.

కాలు కదపక…

జగన్ అయితే తాడేపల్లి నుంచి అసలు బయటకు రావడంలేదు. ప్రతీ రోజూ మాత్రం సమీక్షలు చేస్తున్నారు. అక్కడ అంతా బాగుంది అనే అంటారు. అయినా సరే జగన్ వాస్తవాలు తెలుసుకోమని అధికారులను పురమాయించారు. ప్రభుత్వ పధకాలు సక్రమంగా జనాలకు చేరుతున్నాయా లేదా అన్నది చూడమని వారిని ఆదేశించారు. అయితే ఈ విషయంలో ఎక్కువ మంది అధికారులు అలసత్వమే చూపించారు. అంతే జగన్ లో అసహనం కట్టలు తెంచుకుంది. వారికి మెమోలు జారీ చేయమని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇది తనకు తాను ఇచ్చుకుంటున్న మెమోగా కూడా జగన్ చెప్పుకొచ్చారు.

కళ్ళూ చెవులూ…

జగన్ కి అధికారులే కళ్లూ చెవులు. వారినే ఆయన నమ్ముకున్నారు. ప్రభుత్వం అంటే వారే. కానీ వారితో పాటు ఎన్నికలైన 150 మంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు. వారిని విశ్వాసంలోకి తీసుకోకుండా బ్యూరోకాట్స్ కే బాధ్యతలు అప్పగించడం వల్ల తొలిసారి జగన్ దెబ్బ తిన్నాను అని గ్రహించారు. అందుకే ఆయన తన పనితీరు మీద కూడా మెమో అంటూ బాధపడుతున్నారు. నిజానికి ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ ఉంది. ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి. ఎమ్మెల్యేలు జనం నుంచి వచ్చారు. వారికి అన్ని విషయాలు తెలుస్తాయి. వారి ద్వారా పధకాల అమలు జరిగితే అవినీతి జరుగుతుందని పక్కన పెట్టారు. మంత్రులకు విలువ ఇస్తే వారు ఏం చేస్తారో అని దూరం పాటించారు. ఇపుడు అధికారులు కూడా ఉదాశీనంగా ఉన్నారని ప్రభుత్వ పెద్ద మధనపడితే లాభమేంటి అన్న ప్రశ్న వస్తోంది.

మేలుకోవాలి….

ఇకనైనా జగన్ మేలుకోవాలని అంటున్నారు. తన తీరు మార్చుకోవాలని కూడా పార్టీలోని వారే కోరుకుంటున్నారు. అధికారులకు రాజకీయాలతో సంబంధం లేదు. రేపటి రోజున ప్రభుత్వం మళ్లీ రావాలి అన్న తపన పార్టీ వారికే ఎక్కువగా ఉంటుంది. ఆ సంగతి గుర్తెరిగి జగన్ వారికి బాధ్యతలు అప్పగినాలి. అంతే కాదు, సమీక్షలో అంతా బాగుంది అన్న మాటలకు పడిపోయి మాయలో ఉండడం కంటే నిజాలు తెలుసుకుని పాలన చక్కదిద్దుకునేందుకు చొరవ చూపాలని కోరుతున్నారు. అధికారులకు మెమేలు ఒకసారి ఇస్తే సరే పదే పదే వారిని దోషులుగా చేస్తామంటే వారూ ఊరుకోరు. ఏది ఏమైనా అధికారులను నమ్ముకుని చెడిన రాజకీయ నాయకులు ఉన్నారు. జగన్ ఆ బాటన నడవకూడనే వైసీపీ వారు గట్టిగా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News