ఏది విడదీసిందో అదే కలుపుతుందిట… ?
ఈ ప్రకృతిలో చర్యకు ….ప్రతిచర్య ఉంటుంది. అలాగే ప్రతి సంఘటనకూ కూడా మరో చోట జవాబు ఉంటుంది. ప్రతీ దానికీ తెలియకుండానే వేరే బంధం కూడా ఉంటుంది. [more]
;
ఈ ప్రకృతిలో చర్యకు ….ప్రతిచర్య ఉంటుంది. అలాగే ప్రతి సంఘటనకూ కూడా మరో చోట జవాబు ఉంటుంది. ప్రతీ దానికీ తెలియకుండానే వేరే బంధం కూడా ఉంటుంది. [more]
ఈ ప్రకృతిలో చర్యకు ….ప్రతిచర్య ఉంటుంది. అలాగే ప్రతి సంఘటనకూ కూడా మరో చోట జవాబు ఉంటుంది. ప్రతీ దానికీ తెలియకుండానే వేరే బంధం కూడా ఉంటుంది. రాజకీయాల్లో అయితే వీటిని సులువుగా అర్ధం చేసుకోగలరు. జగన్ ఎక్కడ పుట్టారు అంటే కాంగ్రెస్ పొత్తిళ్ళలో అని చెప్పాలి. వైఎస్సార్ పక్కా కాంగ్రెస్ వాది. ఆయన కాంగ్రెస్ లోనే పుట్టారు. అక్కడ ఎదిగారు. ఆ కాంగ్రెస్ సేవలోనే తనువు అర్పించారు. జగన్ కి ఊహ తెలిసిన తరువాత ఆయన ఇంట్లో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెసే. ఇక జగన్ తండ్రి తరఫున ప్రచారం చేసినా తాను తొలిసారి పోటీ చేసినా కూడా అదే కాంగ్రెస్ నుంచి.
క్షమించేశారా…?
జగన్ చాన్నాళ్ళ క్రితం ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినపుడు ఒక మాట అన్నారని చెబుతారు. అదేంటి అంటే తాను కాంగ్రెస్ ని క్షమించేశాను అని. గతం గతహా అంటూ ఆయన వేదాంతమూ వల్లించారు. ఇపుడు అవే మాటలు ప్రశాంత్ కిశోర్ వల్లె వేస్తున్నారుట. ఏ కాంగ్రెస్ వల్ల అయితే జగన్ ఈ రోజుకీ తిప్పలు పడుతున్నారో సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారో ఆ కాంగ్రెస్ ని జగన్ క్షమించేశారు అన్నదే ఇక్కడ పాయింట్. ఇక కాంగ్రెస్ కి కెప్టెన్ బాధ్యతలు అప్పగించి టీమ్ ని రెడీ చేస్తున్న ప్రశాంత్ కిశోర్ కూడా కాంగ్రెస్ జగన్ విషయంలో పెద్ద మనసు చేసుకోవాలని అంటున్నారుట.
సీబీఐ తీగ ఆధారం ….
జగన్ కాంగ్రెస్ ని ధిక్కరించారు అన్న ఏకైక కారణంతోనే ఆయన మీద సీబీఐ కేసులు పెట్టారు అన్నది అంతా నమ్మే విషయం. జగన్ అవినీతి చేశారా లేదా అన్నది పక్కన పెడితే ఆయన మీద పెద్ద ఎత్తున కేసులు ఫెయిల్ చేసి పదహారు నెలలు జైలు గోడల మధ్యన కూర్చోబెట్టడం అంటే అది కచ్చితంగా కాంగ్రెస్ కక్ష అనే అంటారు. దాని వల్లనే ఇద్దరికీ చెడింది అని కూడా చెప్పుకోవాలి. ఇపుడు అవే సీబీఐ కేసులు జగన్ తో దోస్తీని కలపడానికి ఆధారం అవుతున్నాయట. వింతగా ఉన్నా ఇదే నిజమని ఢిల్లీ వార్తల సారాంశం.
అభయ హస్తమేనటగా..?
రేపటి రోజున కేంద్రంలో బీజేపీ ఓడితే వచ్చేది కాంగ్రెసే. ఆ సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద పార్టీగా జాతీయ పార్టీగా కాంగ్రెస్ నాయకత్వాన్నే అంతా అంగీకరిస్తారు. ప్రశాంత్ కిశోర్ వ్యూహం కూడా అదే. మరి కాంగ్రెస్ వస్తే జగన్ రాజకీయం ఎలా ఉంటుంది. అంటే ఇపుడైతే చెప్పలేరు కానీ రేపటి రోజున మాత్రం గట్టి బంధమే పడుతుంది అంటున్నారు. జగన్ తమకు మద్దతు ఇస్తే ప్రతిగా ఆయన మీద ఉన్న సీబీఐ కేసుల విషయంలో భారీ ఉపశమనం కలిగించడానికి కాంగ్రెస్ పెద్దలు సిద్ధపడతారు అన్నది కూడా ప్రచారంలో ఉంది. ఇప్పటిదాకా బీజేపీని నమ్ముకున్న జగన్ కి అటు వ్యక్తిగతంగానూ, ఇటు రాజకీయంగానూ దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి. ఆఖరుకు సీన్ ఎంతదాకా వచ్చినంటే తన పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసి జగన్ కి నిద్రలేని రాత్రులు మిగిలిస్తున్నా బీజేపీ చోద్యం చూస్తోందని వైసీపీ నేతలు నిందించేటంతవరకూ. అందుకే ఇవాళ కాకపోయినా రేపు అయినా వైసీపీ రాజకీయం మారవచ్చు అంటున్నారు. నాడు ఏ పామునైతే జగన్ మీదకు వదిలారో అది కాటేసిన చోట విషాన్ని తీసే విరుగుడు కూడా తమ వద్దే ఉందని కాంగ్రెస్ చెబుతోంది. మరి రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న జగన్ ఈసారి కరెక్ట్ రూట్లోనే వెళ్తారని చెబుతున్నారు.