టెన్షన్ …టెన్షన్… బెయిల్ రద్దు ఏమవుతుంది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తీర్పునకు సమయం మరో నాలుగు రోజుల పాటు మాత్రమే గడువు ఉండటంతో [more]

;

Update: 2021-08-21 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తీర్పునకు సమయం మరో నాలుగు రోజుల పాటు మాత్రమే గడువు ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈనెల 25వ తేదీన సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు వెలువడనున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం వైసీపీలోనూ పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. పొలిటికల్ సర్కిళ్లలోనూ ఉత్కంఠ నెలకొంది.

కేసులు నిలవవంటూ….

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సీబీఐ అనేక కేసులు నమోదు చేసింది. క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. అయితే గత ఎనిమిదేళ్లుగా దీనికి సంబంధించిన వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ కు ఈ కేసులతో నేరుగా సంబంధం లేకపోవడం, అప్పటి కేబినెట్ నిర్ణయాలు కావడంతో జగన్ సులువుగా కేసుల నుంచి బయటపడతారని తొలి నుంచి న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు.

అన్ని ఆధారాలు….

అయితే బెయిల్ రద్దుపై మాత్రం కొంత టెన్షన్ నెలకొంది. సీీబీఐ ఇప్పటికే అన్ని కేసులకు సంబంధించి ఆధారాలు సేకరించిందని, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎవరినీ ప్రలోభ పెట్టే అవకాశం లేదన్నది జగన్ తరుపున న్యాయవాదుల వాదన. కొత్తగా సాక్షులను బెదిరించేదీ ఉండబోదని కూడా చెబుతున్నారు. అందుకే జగన్ బెయిల్ రద్దు చేయడం అంత సులువుకాదన్నది కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు.

ఖచ్చితంగా రద్దవుతుందని….

కాకుంటే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తాను బెయిల్ రద్దు పిటీషన్ వేయడం వల్లనే అరెస్ట్ చేశారంటూ చేసిన వాదనపైనే కొంత ఇబ్బంది ఎదురవుతుందంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా న్యాయానికి కట్టుబడి ఉండాల్సిందేనని, ముఖ్యమంత్రి కూడా అందుకు భిన్నం కాదన్నది తీర్పు ద్వారా మరోసారి స్పష్టమవుతుందని రఘురామ కృష్ణరాజు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ బెయిల్ రద్దు పిటీషన్ తీర్పుపై సమయం దగ్గరపడే కొద్దీ సర్వత్రా టెన్షన్ నెలకొంది.

Tags:    

Similar News