ఆ నిర్ణయంతో….జగన్ కు భారీ లాస్ ..?
నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో జరగదని తేలిపోయింది. చట్టసవరణ చేసి విభజనచట్టం ప్రకారం అమలు చేయాల్సి ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుదలకు కేంద్రం ఇష్టపడటం లేదని [more]
;
నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో జరగదని తేలిపోయింది. చట్టసవరణ చేసి విభజనచట్టం ప్రకారం అమలు చేయాల్సి ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుదలకు కేంద్రం ఇష్టపడటం లేదని [more]
నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో జరగదని తేలిపోయింది. చట్టసవరణ చేసి విభజనచట్టం ప్రకారం అమలు చేయాల్సి ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుదలకు కేంద్రం ఇష్టపడటం లేదని అర్థమవుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా నష్టపోయే అవకాశాలున్నాయి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల నుంచి 225 స్థానాలకు పెంపుదల చేయాల్సి ఉంది.
అందరికీ అవకాశం…
జనాభా లెక్కలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం 2026 జనాభా లెక్కల తర్వాత 2031లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని తేల్చి చెప్పింది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే రాజకీయ పార్టీలకు కొంత వెసులుబాటు లభిస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి టిక్కెట్లను కేటాయించడంతో పాటు పార్టీలో సమర్థులు, ఇమేజ్ ఉన్న వారందరికీ న్యాయం చేసే అవకాశముంటుది. అయితే జగన్ వచ్చే సారి ఈ అవకాశాన్ని కోల్పోయినట్లే కన్పిస్తుంది.
టీడీపీని దెబ్బతీయాలంటే…?
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉంది. నాయకత్వ సమస్యతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగితే టీడీపీ నుంచి పెద్దయెత్తున వలసలు ఉండే అవకాశముంది. ఇది జగన్ పార్టీకి అడ్వాంటేజీగా కూడా ఉంటుంది. సంక్షేమ పథకాలతో ఇప్పటికే ప్రజల మద్దతును కూడగడుతున్న జగన్ కు నియోజకవర్గాలు పెరిగితే రాజకీయంగా లాభం చేకూరే అవకాశముంది.
ఇక వలసలుండవుగా…?
అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో జరిగేలా లేదు. వచ్చే ఎన్నికల్లోనూ 175 నియోజకవర్గాల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది. అంటే వైసీపీకి ధీటైన ఒకే ఒక పార్టీ టీడీపీ నుంచి ఇక నేతలు వచ్చే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో జగన్ మరింత బలపడటం ఇష్టం లేకనే నియోజకవర్గాల పెంపును పక్కన పెట్టిందన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచి విన్పిస్తున్నాయి. మొత్తం మీద మోడీ నిర్ణయం జగన్ కు రాజకీయంగా భారీ లాస్ గానే కన్పిస్తుంది.