జగన్ వైఖరి నిండా ముంచేస్తుందా..?
అటు పార్టీ-ఇటు ప్రభుత్వం.. రెండింటికీ సమన్యాయం చేయాల్సిన జగన్.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా ? ఆయన వైఖరితో పార్టీ-ప్రభుత్వం రెండూ దెబ్బతింటున్నాయా ? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ [more]
అటు పార్టీ-ఇటు ప్రభుత్వం.. రెండింటికీ సమన్యాయం చేయాల్సిన జగన్.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా ? ఆయన వైఖరితో పార్టీ-ప్రభుత్వం రెండూ దెబ్బతింటున్నాయా ? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ [more]
అటు పార్టీ-ఇటు ప్రభుత్వం.. రెండింటికీ సమన్యాయం చేయాల్సిన జగన్.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా ? ఆయన వైఖరితో పార్టీ-ప్రభుత్వం రెండూ దెబ్బతింటున్నాయా ? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ సీనియర్లు. పార్టీలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. దీంతో సీనియర్లు.. మౌనంగా ఉంటున్నారు. పోనీ.. జూనియర్ల విషయానికి వస్తే.. వారు కూడా పార్టీలో తమకు ప్రాధాన్యం లేకుండా పోతోందని.. పార్టీ కోసం మేం కష్టపడుతుంటే.. పదవులు.. ప్రాధాన్యాలు.. వేరేవారికి దక్కుతున్నాయని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ పైకి పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్నా.. లోలోన మాత్రం మేడి పండు చందంగా మారిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
టీడీపీ వైఖరి….
గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ విధానాన్నయితే అవలంభించిందో దానికి తీసిపోని విధంగా ఇప్పుడు వైసీపీ కూడా వ్యవహరిస్తోందని..పార్టీ నేతలు చెబుతున్నారు. కొందరు ఈ విషయంలో బయట పడిపోతున్నారు. మరికొందరు సమయం కోసం వేచి చూస్తున్నారు. “ఇదంతా వన్ మ్యాన్ ఆర్మీ సార్. మాకు ప్రాధాన్యం ఏదీ?“ అనే వారు పెరుగుతున్నారు. దీనికి స్థానిక ఎన్నికలు కారణంగా కనిపిస్తున్నాయి. అనేక మందిని పార్టీ కోసం.. వినియోగించుకున్న టీడీపీ.. చివరకు పదవుల విషయానికి వస్తే.. ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబెట్టిందనే ఆరోపణలు గతంలో వినిపించాయి.
ఎన్నికల తర్వాత వచ్చిన వారికి…?
ఇప్పుడు సామాజిక వర్గం పేరు వినిపించకపోయినా.. అనామకులకు, పార్టీలో అసలు ఎప్పుడు చేరారో.. పార్టీ కోసం ఏం చేశారో .. తెలియని వారికి ఇప్పుడు పదవులు దక్కుతున్నాయనేది జూనియర్లు, సీనియర్లు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇంకా చెప్పాలంటే ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినవారికి, ఎన్నికల్లో ఓడి ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి ఒక్కొక్కరికే మూడు పదవులు ఇస్తున్నారు. ఇదే విధంగా మున్ముందు కూడా పరిస్థితి కొనసాగితే.. ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
అలివికాని.. హామీలతో…
ఇక, ప్రభుత్వం విషయానికి వస్తే.. జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు.. ఇప్పుడు పెద్ద శాపంగా పరిణమించాయని అంటున్నారు పార్టీ పెద్దలు. “హామీలు ఇచ్చేశాం.. కాబట్టి వెనక్కి తీసుకోకూడదు.. అనే ధోరణితో మా నాయకుడు వ్యవహరిస్తున్నారు. కేంద్రాన్ని చూసుకుంటే.. ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ.. బ్లాక్ మనీ తెస్తామన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలోనూ 15 లక్షల చొప్పున వేస్తానని చెప్పారు. కానీ, చేయలేదు. పోనీ.. ఇలా కాకపోయినా.. కొన్నింటిని తగ్గించుకోవాల్సిన అవసరం మాకూ ఉంది. ఈ విషయంలో ఎంత చెబుతున్నా.. మా నాయకుడు పట్టించుకోవడం లేదు“ అని పార్టీలో కీలక నేతలు చెపుతున్నారు.
హామీల వల్లనే…?
హామీల కారణంగా వస్తున్న సొమ్ము వచ్చినట్టే పందేరం జరిగి.. రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందని.. దీనివల్ల కేంద్రం ముందు కూడా తలెత్తుకోలేక పోతున్నామని.. వారి ఆవేదనగా ఉంది. మొత్తంగా చూస్తే.. అటు పార్టీలో అసంతృప్తులు పెరిగిపోయి.. ఇటు ప్రభుత్వాన్నినడిపించడం భారంగా మారడంతో ఇబ్బందులు తప్పేలా లేవని.. ఇంకా మూడేళ్లు ప్రభుత్వాన్ని నడిపించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి