తొందరగా 2024 వస్తే బాగుండు… ?
ఎన్నికలు రావాలి అన్నది విపక్షంలో ఉన్న వారికి కోరిక. ఎందుకంటే వారికి పూట గడవడం యుగంగా మారుతుంది కాబట్టి. చంద్రబాబు ఆయన పార్టీ టీడీపీ కూడా 2019 [more]
;
ఎన్నికలు రావాలి అన్నది విపక్షంలో ఉన్న వారికి కోరిక. ఎందుకంటే వారికి పూట గడవడం యుగంగా మారుతుంది కాబట్టి. చంద్రబాబు ఆయన పార్టీ టీడీపీ కూడా 2019 [more]
ఎన్నికలు రావాలి అన్నది విపక్షంలో ఉన్న వారికి కోరిక. ఎందుకంటే వారికి పూట గడవడం యుగంగా మారుతుంది కాబట్టి. చంద్రబాబు ఆయన పార్టీ టీడీపీ కూడా 2019 ఎన్నికల తరువాత నుంచి అలాగే కోరుకున్నాయి. మరో వైపు అధికారంలో ఉన్న పార్టీకి అయితే ఒక్కో రోజూ వెళ్ళిపోతూంటే తమ అధికారం కొవ్వొత్తిలా కరిగిపోతోంది అన్న చింత ఉంటుంది. అందుకే వారు కాలమిలా ఆగిపోనీ అంటూ పాటలు పాడుకుంటారు. కానీ ఏపీలో ఇపుడు సీన్ చూస్తే కంప్లీట్ రివర్స్ లో సాగుతోంది. 2024 ముందే రావాలి అంటోంది వైసీపీ. ఇక టీడీపీ మాత్రం తాపీగా కానీయ్. ఈ లోగా చాలా చిత్రాలు జరగాలి అంటోంది.
తేడాగా ఉందే..?
అవును. ఇది నిజంగా తేడాగానే ఉంది మరి. పొరుగున ఉన్న తెలంగాణాలో విపక్షాలు ఎన్నికలు కోరుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ ఇంకా పవర్ లో తామే ఉండాలనుకుంటోంది. దేశంలో కూడా సరిగ్గా అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏపీలో మాత్రమే తేడాగా రాజకీయ కధ నడుస్తోంది. దానికి కారణం వైసీపీకి ఇపుడు వాస్తవాలు అర్ధమవుతున్నాయి. భ్రమలు తొలగిపోతున్నాయి. ఒక్కో రోజు కడు భారంగా గడుస్తోంది. అధికారం అన్నది బాధ్యత కంటే కూడా అతి పెద్ద బరువుగా మారిపోతోంది. దాంతో ఎన్నికలు త్వరగా వస్తే బాగుండు అంటోంది వైసీపీ.
అదే భయమట …
జగన్ మాట తప్పను, మడమ తిప్పను అని తరచూ చెబుతారు. కానీ ఇపుడు చూస్తే మాట తప్పడానికి పరిస్థితులు ప్రేరేపిస్తున్నాయి. తాను అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ తీస్తాను అని చెప్పారు. అది రెండేళ్ళు అయినా జరగలేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తామని కొత్త పీయార్సీని డిక్లేర్ చేస్తామని కూడా చెప్పారు. అదీ అమలు కాలేదు. ఇవేకాదు చాలా హామీలు అలా ఉండిపోయాయి. వీటి కంటే కూడా ఇపుడు పేదలకు సంక్షేమ పధకాలు ఆగిపోతే ఎలా అన్న బెంగ జగన్ కి పట్టుకుంది అంటున్నారు. నానాటికీ తీసికట్టుగా ఏపీ ఆర్ధిక పరిస్థితి ఉంది. దాంతో తాను ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా హామీలు తీర్చకపోతే ఎందుకు పదవులు అన్నది కూడా ఆయన ఆలోచనగా చెబుతున్నారు.
దినదిన గండమే ….
ఇన్నాళ్ళూ ఎన్నికలు పెట్టండి అంటూ రంకెలు వేసిన టీడీపీ ఇపుడు సైలెంట్ అయింది. జగన్ మీద నెమ్మదిగా వ్యతిరేకత జనాలలో వస్తోంది. అందువల్ల మరో రెండున్నరేళ్ళు ఇలాగే సాగితే బంపర్ మెజారిటీ ఈసారి తమకు వస్తుంది అన్న లెక్కలు టీడీపీ వేసుకుంటోంది. జగన్ కి మోజు మీద ఓట్లు వేసిన జనాలకు అసలు కధ తెలియాలంటే అయిదేళ్ళూ ఆయనే సీఎం గా ఉండాలన్నది టీడీపీ ఎత్తుగడగా ఉంది మరి. మరి జగన్ సరిగ్గా ఇరుక్కుపోయారు. ముందుకు పోలేరు. అలాగని వెనక్కి రాలేరు. అందువల్ల ఆయనకు 2021 అసలు నచ్చడంలేదుట. అంతే కాదు, క్యాలండర్ అలా గిర్రున తిరిగేసి 2022, 2023 కూడా స్పీడ్ గా వెళ్ళిపోయి 2024 వచ్చేస్తే బాగుంటుంది అన్నదే ఆలోచనట. మరి టైమ్ మిషన్ కనుక ఉంటే అదే జరిగేది కానీ ఇపుడు జగన్ కోరిక ఎలా తీరుతుంది.