ఈ మంత్రులపై నివేదిక కోరిన జగన్?
వైసీపీ అధినేత, ప్రభుత్వ సారథి.. జగన్ త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన చేయనున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత ప్రభుత్వంలో మంత్రులను మారుస్తానని చెప్పిన.. జగన్.. అనుకున్న [more]
;
వైసీపీ అధినేత, ప్రభుత్వ సారథి.. జగన్ త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన చేయనున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత ప్రభుత్వంలో మంత్రులను మారుస్తానని చెప్పిన.. జగన్.. అనుకున్న [more]
వైసీపీ అధినేత, ప్రభుత్వ సారథి.. జగన్ త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన చేయనున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత ప్రభుత్వంలో మంత్రులను మారుస్తానని చెప్పిన.. జగన్.. అనుకున్న విధంగా చేసేందుకు.. రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే జగన్.. తనకు తానుగా విధించిన టైం పిరియడ్.. రెండున్నరేళ్లు. ఈ రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను 90 శాతం మారు స్తానని చెప్పారు. ఈ క్రమంలో దాదాపు 20 మంది మంత్రులను ఇంటికి పంపేయాల్సి ఉంటుంది.
కొత్త ముఖాలకు….
ఈ క్రమంలో కొత్త మొఖాలకు అవకాశం ఇవ్వనున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరిని తొలగించాలి ? ఎవరి అవసరం ఉంది ? అనే అంశాలపై.. సీఎం జగన్ భారీగానే కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పుడున్న పరిస్థితిలో కొందరు మంత్రులు కీలకంగా మారారు. ఉదాహరణకు.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని.. ఇలా మరికొందరిని మార్పు చేయడం అంటే.. ఒకింత ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు.
వీరి పనితీరుపై….
ఈ క్రమంలో పనితీరు ఆధారంగా.. జగన్.. కొందరిని పక్కన పెట్టి మరికొందరికి అవకాశం కల్పించే ఛాన్స్ కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న మంత్రుల్లో.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం కే. నారాయణ స్వామి, కాపు సామాజిక వర్గానికి చెందిన కురసాల కన్నబాబు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలను పక్కన పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.
నివేదికలు రాగానే…?
అదేవిధంగా .. గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగ నాథరాజు, పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ సహా కర్నూలుకు చెందిన బీసీ మంత్రి గుమ్మనూరు జయరాం.. వంటి వారిని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయా మంత్రుల పనితీరుపై సీఎం జగన్ ఇంటిలిజెన్స్ నివేదికలు కోరారని.. వాటి ఆధారంగా.. ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని.. వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుండడం గమనార్హం. దీంతో ఈ విషయం.. ఇటు పార్టీలోను, అటు ప్రభుత్వంలోనూ ఆసక్తిగా మారింది.