జగన్.. ట్రిపుల్ స్టిక్కర్లు…?

జగన్ మీద విమర్శలు చేయడానికి విపక్షాలు కొత్త పదాలను ఎంచుకుంటున్నాయి. జగన్ ని మామూలుగా అంటే జనాల నుంచి రియాక్షన్ లేదు. అదే సమయంలో ఆయన పధకాలు [more]

;

Update: 2021-08-07 08:00 GMT

జగన్ మీద విమర్శలు చేయడానికి విపక్షాలు కొత్త పదాలను ఎంచుకుంటున్నాయి. జగన్ ని మామూలుగా అంటే జనాల నుంచి రియాక్షన్ లేదు. అదే సమయంలో ఆయన పధకాలు అమలు చేసుకుంటూ పోతున్నారు. వాటికి ఎవరు కాదన్నా జనాల్లో బాగానే ఇంపాక్ట్ ఉంది. అందుకే జగన్ ని ఈ విషయంలో తిట్టలేకపోతున్నారు. వేరేగా మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారు. అది టీడీపీ అయినా బీజేపీ అయినా మరో పార్టీ అయినా కూడా అంతే. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఈ విషయంలో సరికొత్తగా మాట్లాడుతున్నారు.

సోకు చేస్తున్నారా ..?

కేంద్రం పధకాలను జగన్ పేరు మార్చి ఏపీలో అమలు చేసుకుంటూ గొప్పలు పోతున్నారని సోము వీర్రాజు విమర్శిస్తున్నారు. నిజానికి నాడు నేడు వంటి విద్యా కార్యక్రమాలకు కేంద్రం ఇస్తున్న నిధులే కారణమని ఆయన అంటున్నారు. అదే విధంగా స్కూల్ యూనిఫారాల‌ నుంచి అన్నీ కూడా కేంద్రమే నిధులు ఇస్తూంటే జగన్ మాత్రం తామే చేసినట్లుగా చెప్పుకోవడం దారుణమని ఆయన అంటున్నారు. ఈ విషయంలో జగన్ చంద్రబాబుని మించిపోయారని కూడా సోము హాట్ కామెంట్స్ చేస్తున్నారు. బాబు డబుల్ స్టిక్కర్ వేస్తే జగన్ ట్రిపుల్ స్టిక్కర్ వేసి మావే అన్నీ అంటూ బల్ల గుద్దుతున్నారట.

ఎన్ని సార్లు చెప్పినా…?

సరే కొంతసేపు ఆయా పధకాలు అన్నీ కూడా కేంద్రం ఇచ్చిన నిధులతోనే అమలు అవుతున్నాయనుకున్నా కూడా దేశంలో ఏపీతో సహా అన్ని రాష్ట్రాలూ కూడా తమ పధకాలుగానే వాటిని అమలు చేసుకుంటున్నాయి అన్నది సోము గుర్తించాలిగా. అంతే కాదు, నాడు నేడు వంటి జగన్ ప్రవేశపెట్టిన కొత్త పధకాన్ని దేశంలో మరో రాష్ట్రంలో సోము చూపించగలరా అంటున్నారు వైసీపీ నేతలు. ఇక ఏపీలో ప్రతీదీ తామే చేస్తున్నామని బీజేపీ చెప్పుకోవడం వల్ల జనాలు కొత్తగా టర్న్ అయ్యేది కూడా ఏమీ ఉండదు, పైగా కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం కామనే అన్న భావన కూడా ఉంటుంది. వీటి కంటే గట్టి మేలు చేసే పధకాలను కేంద్రం నుంచి సోము మంజూరు చేయించవచ్చు కదా అన్నదే సగటు ఏపీ జనాల సూటి ప్రశ్న.

డైరెక్ట్ గా చేస్తే.?

ఏపీకి ప్రత్యేక హోదా ఇవాల్సింది కేంద్రం. ఆ సంగతి అందరికీ తెలుసు. ఒక వేళ హోదా ఇస్తే మేమే ఇచ్చామని జగన్ ఎక్కడా చెప్పుకోలేరు. చెప్పుకున్నా కూడా జనాలు అసలు నమ్మరు. అదే విధంగా పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టులకు పూర్తి నిధులు ఇచ్చి అక్కడ వాజ్ పేయ్ బొమ్మనో, మోడీ బొమ్మనో పెట్టించుకుంటే గోదావరి జిల్లాల్లో రాజకీయం టర్న్ అవుతుంది కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయమని చెప్పినా కూడా బీజేపీ మీద కొంత సానుభూతి వస్తుంది కదా. మరి ఆ పని చేయకుండా కేంద్రం నిధులు ఇస్తోంది అంటూ ఊకదంపుడు కబుర్లు చెబితే బీజేపీని జనాలు ఎందుకు పట్టించుకుంటారు అన్నదే ప్రజల ప్రశ్న.

Tags:    

Similar News