జగన్ దర్శనం చేసుకుంటున్నారు… ?
టైమ్ దగ్గర పడుతోంది. జగన్ విధించిన గడువు సమీపిస్తోంది. దాంతో ఆశావహుల్లో సరికొత్త ఊహలు వస్తున్నాయి. కొద్ది నెలల్లో తామే అమాత్య కిరీటం పెట్టుకుని దర్జా ఒలకబోస్తామని [more]
;
టైమ్ దగ్గర పడుతోంది. జగన్ విధించిన గడువు సమీపిస్తోంది. దాంతో ఆశావహుల్లో సరికొత్త ఊహలు వస్తున్నాయి. కొద్ది నెలల్లో తామే అమాత్య కిరీటం పెట్టుకుని దర్జా ఒలకబోస్తామని [more]
టైమ్ దగ్గర పడుతోంది. జగన్ విధించిన గడువు సమీపిస్తోంది. దాంతో ఆశావహుల్లో సరికొత్త ఊహలు వస్తున్నాయి. కొద్ది నెలల్లో తామే అమాత్య కిరీటం పెట్టుకుని దర్జా ఒలకబోస్తామని తెగ హుషార్ చేస్తున్నారు. జగన్ తప్పక తమను గుర్తుపెట్టుకుంటారు అని కూడా వారు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆశావహులు అన్ని రకాలైన లెక్కలు తమకు తామే వేసుకుంటూ నూరు మార్కులు కూడా తామే ఇచ్చేసుకుంటున్నారు. ఆరు నూరు అయినా సరే మంత్రి గిరీ పట్టేయడం ఖాయమని మురిసిపొతున్నారు.
చలో తాడేపల్లి …
జగన్ అధికార నివాసం తాడేపల్లి ఈ మధ్య తెగ సందడి చేస్తోంది. వాస్తవానికి అక్కడికి వచ్చే వారు పోయేవారు ఎపుడూ ఉంటారు. వారితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడే క్యూ కడుతున్నారు. వారంతా జగన్ కి ఒకసారి కనిపించి వస్తే చాలు అనుకుంటున్నారు. మర్యాదపూర్వకమైన కలయిక అని పేరు పెట్టి మరీ సీఎం దగ్గరకు వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారిలో ఎంతమందికి జగన్ అపాయింట్మెంట్లు లభిస్తున్నాయి అన్నది తెలియదు కానీ కలసిన వారు మాత్రం ఫోటోలు జాగ్రత్తగా మీడియాకు రిలీజ్ చేస్తూ తాము మంత్రి పదవి రేసులో ఉన్నామని అనిపించుకుంటున్నారు.
గుడివాడ హడావుడి….
ఇక విశాఖ జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే గుడివాడ అమరానాధ్ అయితే ఏదో పని మీద నెలలో కనీసం రెండుసార్లు తాడేపల్లి వెళ్ళి వస్తున్నారు. ఆయన వివిధ సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్తున్నాను అని చెబుతున్నారు. కానీ స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా ఉందని అంటున్నారు. తాను బాగా కష్టపడుతున్నానని జగన్ కి ఈ విధంగా చెప్పుకోవడంతో పాటు మంత్రి గిరీ విషయం గుర్తు చేసినట్లు అవుతుందన్న వ్యూహంతోనే ఇలా చేస్తున్నారుట. మరి గుడివాడ ఇలా చేస్తే మిగిలిన వారు ఊరుకుంటారా. వారు కూడా సీఎం వద్దకు వెళ్తున్నారు.
పదవి పరుగులు…
మంత్రి పదవి కోసం పరుగులు పెడుతున్న వారి జాబితా ఉత్తరాంధ్రాలో ఎక్కువగానే ఉందని చెప్పాలి. పాయకరావుపేట గొల్లబాబూరావు అయితే కులమే తన బలం అంటున్నారు. ఎపుడూ కాపులకేనా మాకు కూడా చాన్స్ ఇస్తారు జగన్ అనుకుంటూ ఆయన భారీ అంచనాలే వేసుకుంటున్నారు. వెలమలలో తాను ముందు వరసలో ఉన్నాను అని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు అంటున్నారు. తనకు మొదటి సారే మంత్రి పదవి రావాలి, అయితే కొన్ని సమీకరణల వల్లనే అది ఆగింది. ఈసారి ఖాయమని అంటున్నారు. ఇక నర్శీపట్నం ఎమ్మెల్యేతో మొదలుపెడితే చాలా మంది మంత్రి పదవి కోసం పెద్దాశలే పెట్టుకున్నారు. వీరంతా కూడా జగన్ దర్శనం కోసం పరుగులు తీస్తున్నారు. చిత్రమేంటి అంటే వచ్చిన వారితో ముచ్చటించి జగన్ పంపిస్తున్నారు. ఇలా వెళ్ళిన వారు కూడా అసలు విషయం మాత్రం దాచేసి అన్నీ చెప్పి వస్తున్నారు. మరి ఈ దాగుడుమూతలాటలో మంత్రి కిరీటం ఎక్కడ ఉందో ఎవరైనా కనుగొన్నారా అన్నదే ప్రశ్న. జవాబు దొరకాలి అంటే జగన్ మార్క్ విస్తరణ వరకూ వెయిట్ చేయాల్సిందే.