జగన్ కాళ్ళు చేతులు కట్టేశారా… ?
జగన్ అనుకున్న పనులు అసలు అవడంలేదా అంటే సమాధానం అవును అనే వస్తుంది. జగన్ ఎన్నో అనుకున్నారు. కానీ ఆచరణలో అడుగు ముందుకు పడడంలేదు. ఆయన ఎన్నికల [more]
;
జగన్ అనుకున్న పనులు అసలు అవడంలేదా అంటే సమాధానం అవును అనే వస్తుంది. జగన్ ఎన్నో అనుకున్నారు. కానీ ఆచరణలో అడుగు ముందుకు పడడంలేదు. ఆయన ఎన్నికల [more]
జగన్ అనుకున్న పనులు అసలు అవడంలేదా అంటే సమాధానం అవును అనే వస్తుంది. జగన్ ఎన్నో అనుకున్నారు. కానీ ఆచరణలో అడుగు ముందుకు పడడంలేదు. ఆయన ఎన్నికల ముందు అమరావతే మన రాజధాని అన్నారు. కానీ అప్పటికే ఆయన మనసులో మూడు రాజధానుల ప్రతిపాదన ఉండి ఉండాలి. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలలో ఆ విషయం బయటకు వచ్చింది. ఇక జగన్ సీఎం అయ్యాక అమరావతి మీద పెద్దగా శ్రద్ధ చూపలేదు. దాంతోనే ఆయన వేరే ఆలోచనలలో ఉన్నారు అని కూడా అంతా అన్నారు.
న్యాయస్థానంలో…?
ఇక జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చట్టమైనా కూడా న్యాయం సమీక్ష ముందు ఉంది. అక్కడ తీర్పు ఎపుడు వస్తుందో తెలియదు. ఒక వేళ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినా కూడా సుప్రీం కోర్టులో ప్రత్యర్ధులు అప్పీల్ చేస్తారు. అందువల్ల అక్కడ కేసు విచారణ పూర్తయ్యి తీర్పు వచ్చేసరికి 2024 ఎన్నికలు కూడా జరిగిపోతాయని అంటున్నారు. ఇక జగన్ ఏపీలో అభివృద్ధికి కూడా మాస్టర్ ప్లాన్స్ వేశారు. ఆయన ప్రతీ రోజూ సమీక్ష సందర్భంగా వివిధ శాఖలకు ఇస్తున్న ఆదేశాలు కానీ ఆలోచనలు కానీ చూస్తే ఏదో చేయాలన్న తాపత్రయం కనిపిస్తుంది. కానీ దానికి అతి పెద్ద ప్రతిబంధకం నిధులు లేకపోవడమే.
కరోనాతో…?
ఇక కరోనా మహమ్మారి వల్ల ఏపీ రెవెన్యూ బాగా తగ్గింది. మరో వైపు మద్య పాన నిషేధం అమలు చేస్తామని, దశల వారీగా అని చెప్పినా కూడా ఈ సమయంలో ఆదే ఆదాయం కచ్చితంగా తెచ్చిపెడుతోంది. దాంతో జగన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ప్రతీ ఏడాదికి 250 రూపాయల వంతున సామాజిక పించన్లు పెంచుకుంటూ పోతామని జగన్ చెప్పారు. కానీ మూడవ ఏడాది నడుస్తున్నా కూడా ఇప్పటికీ పెంచలేకపోయారు. అదే విధంగా సీపీఎస్ రద్దు చేయకుండా ఉద్యోగులకు కూడా ఝలక్ ఇచ్చేశారు.. 11వ పీయార్సీ అమలు కూడా లేదు.
చాలా విషయాల్లో…
మొత్తానికి చాలా సమస్యల విషయంలో జగన్ ఏమీ చేయలేకపోతున్నారు. దానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఏది ఏమైనా కరోనా తగ్గితే 2023 నాటికైనా కొంత ఏపీ రెవెన్యూ పెరిగే చాన్స్ ఉంది. కానీ ఈలోగా ముందస్తు ఎన్నికలు అంటూ జమిలికి కేంద్రం రెడీ అయితే మాత్రం జగన్ ఏమీ చేయకుండానే ఎన్నికలను ఫేస్ చేయాలేమో..!