టార్గెట్ జ‌గన్.. కానీ.. వ్యూహం ఏదీ..?

ఏపీలో బ‌లంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టడం ఇప్పుడు ప్రధాన ప్రతిప‌క్షాల‌కు క‌త్తిమీద సాము మాదిరిగా మారింద‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. ఒక‌వైపు ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ.. జ‌గ‌న్‌ను [more]

;

Update: 2021-09-09 15:30 GMT

ఏపీలో బ‌లంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టడం ఇప్పుడు ప్రధాన ప్రతిప‌క్షాల‌కు క‌త్తిమీద సాము మాదిరిగా మారింద‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. ఒక‌వైపు ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ.. జ‌గ‌న్‌ను ఢీ కొట్టి.. గ‌ద్దెదింపి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము రాజ్యాధికారం చేప‌ట్టాల‌నే వ్యూహంతో ఉంది. అయితే.. దీనికి ఎలాంటి మార్గం ఎంచుకోవాల‌నే విష‌యంలో ఇప్పటికీ టీడీపీ ఒక వ్యూహానికి రాలేక పోతోంది. కొంత‌సేపు యువ‌త‌ను ముందు పెట్టి.. రాజకీయం చేయాల‌ని అనుకున్నా.. జ‌గ‌న్ ధాటికి యువ‌త దూకుడు ప‌నిచేసే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు. అదే స‌మ‌యంలో సీనియ‌ర్లను ముందు పెట్టుకుని న‌డిపించాల‌ని అనుకున్నా.. అదీ సాధ్యమ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. టీడీపీ సీనియ‌ర్లు పూర్తిగా అవుట్ డేటెడ్ బ్యాచ్‌గా మారిపోయారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు….

ప్రధానంగా.. గ్రామీణ ప్రాంత ప్రజ‌ల‌కు జ‌గ‌న్ చాలా చేరువ‌య్యారు. అదే స‌మ‌యంలో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా.. ప్రజ‌ల సంక్షేమ కార్యక్రమాల‌కు ఆయ‌న ఎక్కడా వెనుక‌డుగు వేయ‌డం లేదు. దీంతో అన్ని వ‌ర్గాల్లోనూ సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఈ స‌మ‌యంలో టీడీపీ ప్రభుత్వంపై దాడిని ముమ్మరం చేసినా.. ప‌ట్టించుకోవ‌డం లేద‌నే సంకేతాలు.. పార్టీ అధినేత చంద్రబాబు వ‌ర‌కు వ‌స్తున్నాయి. ఈ క్రమంలో జ‌గ‌న్‌ను ఢీ కొట్టడంపై చంద్రబాబు వ్యూహ ప్రతివ్యూహాల‌కు సిద్ధమ‌వుతున్నారు. ఇక‌, మ‌రో ప్రధాన ప్రతిప‌క్షం..బీజేపీ కూడా జ‌గ‌న్‌ను గ‌ద్దె దింపేసి … తాము త‌క్షణ‌మే అధికారంలోకి వ‌చ్చేయాల‌ని భావిస్తోంది.

క్యాడర్ సమస్యతో…..

కానీ, స్థానికంగా చాలా జిల్లాల్లో పార్టీకి కేడ‌ర్ లేదు. పైగా ఉన్న నాయ‌క‌త్వంపై సొంత పార్టీలోనే విమ‌ర్శలు, అసంతృప్తులు ఉన్నాయి. ఈనేప‌థ్యంలో పార్టీని ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లి బ‌లోపేతం చేయ‌డం ఇప్పుడు బీజేపీ ముందున్న ప్రధాన స‌వాల్‌. ఆ త‌ర్వాత‌.. జ‌గ‌న్‌ను టార్గెట్ చేసినా.. ఫ‌లితం ఉంటుంద‌ని భావిస్తు న్నారు. మ‌రో వైపు మీడియాతో బీజేపీ నేత‌లు పెట్టుకున్న వివాదాలు కూడా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రధాన వార్తలు, కీల‌క నేత‌ల మీడియా మీట్‌ల‌ను ఓ వ‌ర్గం మీడియా క‌వ‌ర్ చేయ‌డం లేదు. సో.. ఈ ప‌రిస్థితిలో.. బీజేపీ ఏ విధంగా ముందుకు సాగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

నాయకత్వ లేమితో…

ఇక‌, మ‌రో ప‌క్షం కాంగ్రెస్ పార్టీ అధికారంపై అయితే..క‌న్నేసినా.. స్థానికంగా నాయ‌క‌త్వ లేమి పార్టీని వెంటాడుతోంది. స‌రైన నాయ‌కులు లేరంటూ.. పార్టీలోనే గుస‌గుస వినిపిస్తోంది. ఒకప్పుడు పార్టీని న‌డిపించిన నాయ‌కులు ఇప్పుడు సైలెంట్ అయిపోవ‌డం.. కొంద‌రు వైసీపీకి అనుకూలంగా మారిపోవ‌డం.. ఇంకొందరు పార్టీకి దూరంగా ఉండ‌డం వంటి ప‌రిణామాల‌తో కాంగ్రెస్ నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. దీంతో జ‌గ‌న్‌ను ఏవిధంగా అడ్డుకోవాలి ? ఎలా ముందుకు సాగాలి ? ఏవిధంగా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌నే ప్రశ్నలు.. ఈ మూడు పార్టీల‌నూ వెంటాడుతున్నాయి. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌రిస్థితి అస‌లు ఉన్నారా? లేరా? అనేలా చేసింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జ‌గ‌న్‌కు చెక్ పెట్టే పార్టీ ఒక్కటీ లేద‌నే ఏపీ పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం చెపుతోంది.

Tags:    

Similar News