అత్యుత్సాహంతో రిస్క్ చేస్తోన్న జగన్ ?
నూతన విద్యా విధానం అన్నది దేశంలో గత ఏడాది ఆమోదించారు. ఇంకా రాష్ట్రాలు దీని మీద ఆలోచిస్తున్నాయి. ఇది అమలు అయితే మంచిదన్న అభిప్రాయం చాలా మందిలో [more]
;
నూతన విద్యా విధానం అన్నది దేశంలో గత ఏడాది ఆమోదించారు. ఇంకా రాష్ట్రాలు దీని మీద ఆలోచిస్తున్నాయి. ఇది అమలు అయితే మంచిదన్న అభిప్రాయం చాలా మందిలో [more]
నూతన విద్యా విధానం అన్నది దేశంలో గత ఏడాది ఆమోదించారు. ఇంకా రాష్ట్రాలు దీని మీద ఆలోచిస్తున్నాయి. ఇది అమలు అయితే మంచిదన్న అభిప్రాయం చాలా మందిలో ఉన్నా దీని సాధ్యాసాధ్యాలు చాలానే ఉన్నాయి. మరి ఈ విషయంలో ఏపీ మాత్రం తొందరపడిపోయింది. ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని అంటోంది. అంటే ఆరు రకాలుగా స్కూలింగ్ విద్యను విభజించి విద్యా నైపుణ్యాన్ని పెంచడం అన్న మాట. ఈ విధానం ద్వారా తమ ఉపాధి పోతుందని ఒక వైపు అంగన్ వాడీలు అంటున్నారు. మరో వైపు తమ మీద భారం పెరిగిపోతుంది అని ఉపాధ్యాయులు అంటున్నారు. అయితే ఇవేమీ పట్టని జగన్ సర్కార్ మాత్రం అమలు చేయాల్సిందే అంటోంది.
చర్చ జరగాల్సి ఉన్నా…?
దీని మీద నిజానికి మరింత చర్చ జరగాలి. ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. అదే విధంగా టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక మేధావులు ఉన్నారు. విద్యావేత్తలు ఉన్నారు. వీరందరి అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుంటే ఇంకా మంచి జరిగేది అన్న భావన అందరిలో ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా విద్యా విధానం అమలుకు రెడీ అయిపోతోంది. ఒక వైపు చూస్తే ఉపాధ్యాయ ఖాళీలు రాష్ట్రంలో పాతిక నుంచి ముప్పయి వేల దాకా ఉన్నాయి. ఇక ఏడాదికి అయిదారు వేల మంది రిటైర్ అవుతూనే ఉంటారు. జగన్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయడం లేదు.
రెండేళ్లుగా డీఎస్సీ లేక…
రెండేళ్ళుగా డీఎస్సీ లేదు. దాంతో చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి. సబ్జెక్ట్ టీచర్లు లేరు. ఇక ఆరు రకాలుగా విద్యను విభజించి చేయాలి అంటే ఏపీలోని పదమూడు జిల్లాలల్లో అన్ని చోట్లా ఒకే విధమైన స్ట్రక్చర్ లేదు. మరి ఈ పరిస్థితులలో నూతన విద్యా విధానం అంటూ పరుగులు పెట్టడం వల్ల మంచి కంటే చెడు ఫలితాలే ఎక్కువగా వస్తాయని మేధావులు అంటున్నారు. ఈ ఏడాది కరోనా ఉంది. స్కూల్స్ కూడా తెరవలేని పరిస్థితి. అందువల్ల మేధో మధనం జరిపేందుకు దీనిని అవకాశంగా జగన్ తీసుకుంటే బాగుండేది.కానీ జగన్ సర్కార్ మాత్రం క్యాబినేట్లో తీర్మానం చేసేసింది. ఇక దీని వల్ల మేలు జరిగితే ఓకే కానీ కీడు జరిగితే మాత్రం ఆ బండను జగన్ సర్కార్ మోయాల్సి రావచ్చు. మరి ఈ రిస్క్ ని ఎందుకు చేస్తున్నారు అంటే అతి ఉత్సాహమే అని సమాధానం వస్తోంది