నేరం నాది కాదు… మోడీది… ?
జగన్ కొత్త పధకం ఆలోచిస్తున్నారా.? ఆయన రాజకీయ వ్యూహం పదునెక్కనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నారు. ఏపీలో జగన్ ఒక్కసారిగా మోడీ మీద ధిక్కార [more]
;
జగన్ కొత్త పధకం ఆలోచిస్తున్నారా.? ఆయన రాజకీయ వ్యూహం పదునెక్కనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నారు. ఏపీలో జగన్ ఒక్కసారిగా మోడీ మీద ధిక్కార [more]
జగన్ కొత్త పధకం ఆలోచిస్తున్నారా.? ఆయన రాజకీయ వ్యూహం పదునెక్కనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నారు. ఏపీలో జగన్ ఒక్కసారిగా మోడీ మీద ధిక్కార స్వరాన్ని వినిపించారు. బీజేపీ మీదకు తన మంత్రులను వదిలారు. వారి చేత వరసబెట్టి ఘాటు కామెంట్స్ చేయిస్తున్నారు. దీని వెనక కధ ఏంటి అంటే చాలా ఆసక్తికరమైన సమాచారమే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో బీజేపీకి పెద్దగా సీన్ లేదు. కానీ ఆ పార్టీ నాయకులు జగన్ మీద గట్టిగా విరుచుకుపడుతున్నారు. దాంతో బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా ఏపీలో కాషాయ కళను పెంచడం ఒక ఎత్తుగడ. దానివల్ల టీడీపీకి ఎంతో కొంత దెబ్బ తగలడం ఖాయం.
చేతులెత్తేసినా…?
ఇక ఏపీలో జగన్ సంక్షేమ రధం ఎటూ కదిలేలా కనిపించడంలేదు. బయటకు చెప్పకపోయినా ఇకమీదట సంక్షేమం పేరిట ఖర్చు పెట్టేందుకు అప్పు రూపేణా అయినా కూడా నిధులు అందుబాటులో ఉండకపోవచ్చు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ జగన్ పధకాలు అమలు చేయడంలేదు, హామీ మేరకు ఎవరికీ ఏమీ ఇవ్వడం లేదు అని ప్రచారం చేయడానికి బీజేపీ టీడీపీ వంటి పార్టీలు సిద్ధంగా ఉంటాయి. దాంతో జగన్ ఈ నిందను వారి మీదకు నెట్టేందుకు పూర్వ రంగాన్ని సిద్ధం చేశారని అంటున్నారు. అదెలా అంటే తాను చేపడుతున్న సంక్షేమ పధకాలకు విపక్షాలే అడ్డుపడుతున్నాయని జగన్ చెప్పుకోవడం అన్న మాట. అంటే ఒక వైపు చేతులెత్తేసినా కూడా ఆ తప్పు అన్నది బీజేపీ వంటి వారి మీద తెలివిగా తోసేయడం అన్న మాట.
స్క్రిప్ట్ రెడీ …
అందుకే బీజేపీ మీద ఎన్నడూ లేనిది వైసీపీ మంత్రులు గొంతు చించుకుంటున్నారు. దీని వల్ల బీజేపీ లొంగుతుంది అన్న నమ్మకం లేకపోయినా కొంత వరకూ కట్టడి చేయవచ్చు అన్న లాజిక్ ఏదో వైసీపీకి ఉందిట. అంతే కాదు, ఏపీలో అప్పులు చేస్తున్నారు అంటూ తమ పధకాల మీద విపక్షాలు ఎంత రాద్ధాంతం చేస్తే రాజకీయంగా అంత కలసివస్తుందని కూడా జగన్ భావిస్తున్నారు. దీని వల్ల తాను పేదలకు ఎంతో చేయాలనుకుంటున్నా విపక్షాలే మోకాలడ్డుతున్నాయని కూడా జనాలకు అర్ధమవుతుంది అన్నదే మరో ఎత్తుగడట.
నింద మోయాలా…?
అసలే ఏపీ జనాలకు బీజేపీ మీద పీకబండెడు కోపం ఉంది. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు నెరవేర్చలేదు అని కూడా ప్రజలు గుర్రుమీద ఉన్నారు. ఇపుడు ఏపీలో జగన్ పేదలకు మేలు చేస్తూంటే నిధులు లేకుండా రాకుండా చూస్తున్నారు అన్న ప్రచారం జనాలకు చేరాలన్నదే జగన్ మార్క్ మాస్టర్ ప్లాన్ ట. ఎటూ ఏపీలో సంక్షేమానికి మరి కొద్ది నెలలలో ఫుల్ స్టాప్ పెట్టకతప్పదు. అయితే ఆ నింద తన మీద పడకుండా ఇదంతా కేంద్రమే చేసింది. మోడీయే చేశారు అన్నది చెప్పడానికే వైసీపీ ఈ సరికొత్త అంకానికి తెర తీసింది అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏపీలో రాజకీయం హీటెక్కుతోంది. గతంలో చంద్రబాబు తప్పులన్నీ బీజేపీ మీద తోసేశారు. కానీ జనాల మద్దతును రాబట్టడంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు. కానీ ఇపుడు జగన్ విషయంలో అలా జరగదు అని వైసీపీ నేతలు అంటున్నారు. తాము బీజేపీతో పొత్తులు పెట్టుకోకపోవడం వల్లనే జనాలు తమ మాట నమ్ముతారని కూడా వారు విశ్వసిస్తున్నారు. మరి చూడాలి నిందను భరినేందుకు మోడీ ప్రభుత్వం రెడీగా ఉందా లేదా అన్నది.