సెకండ్ హాఫ్ బాగుంటేనే హిట్ అయ్యేది

జగన్ లో ఒక పారిశ్రామికవేత్త ఉన్నారు. అన్నింటికంటే మించి ఒక రాజకీయ వేత్త దాగున్నాడు. అందుకే రెండేళ్ల పాటు సంక్షేమ పథకాల అమలుకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. [more]

Update: 2021-09-11 11:00 GMT

జగన్ లో ఒక పారిశ్రామికవేత్త ఉన్నారు. అన్నింటికంటే మించి ఒక రాజకీయ వేత్త దాగున్నాడు. అందుకే రెండేళ్ల పాటు సంక్షేమ పథకాల అమలుకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజల్లో తనపైనా, తన పాలనపైనా నమ్మకం పెంచుకోగలిగాడు. అన్నం ఉడికిందా? లేదా? అన్నది ఒక మెతుకు చూస్తే చాలు. అలాగే జగన్ పాలన తొలి రెండేళ్ల పాటు సజావుగా సాగిందనే చెప్పాలి. అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం జగన్ రికార్డు బ్రేక్ చేశారనే చెప్పాలి. పారిశ్రామికవేత్తగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టలేకపోయినా, రాజకీయ వేత్తగా మాత్రం ఓటు బ్యాంకును పదిలపర్చుకున్నారు.

లక్ష కోట్లను జనానికి….?

దాదాపు లక్ష కోట్ల రూపాయలను జనానికి పంచి పెట్టారు. అయితే రానున్న మూడేళ్లు జగన్ కు క్రిటికల్ అనే చెప్పాలి. ఏదైనా సినిమా ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బాగాలేకపోతే అట్టర్ ప్లాప్ అవుతుంది. ఎంత హీరో ఇమేజ్ ఉన్నా సెకండ్ హాఫ్ అనేది సినిమా హిట్టా? ఫట్టా? అన్నది తేలుస్తుంది. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా అంతే. వచ్చే మూడేళ్ల పాలనను బట్టి జగన్ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు విజయం సాధిస్తారన్నది చెప్పగలం.

ఇక అభివృద్ధిపైనే…?

అందుకే జగన్ ఇక వచ్చే మూడేళ్ల పాటు అభివృద్ధి పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణం సత్వరం పూర్తి చేయాలని భావిస్తున్నారు. పాలనలో కూడా తనదైన మార్క్ ను ప్రదర్శించాలన్నది జగన్ పట్టుదలగా ఉంది. అందుకే పది రోజుల కొకసారి సచివాలయానికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. నిజానికి రెండేళ్ల పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినా జగన్ ప్రభుత్వానికి అనుకున్న రీతిలో పాజిటివిటీ లేదన్నది వాస్తవం.

సర్వేలోనూ…..?

ఇటీవల జాతీయ ఆంగ్ల మీడియాలో జరిపిన సర్వేలోనూ అదే తేలింది. విపక్షాలు కోరుకుంటున్న నెగిటివ్ ఏపీ ప్రభుత్వంపై లేదని, అదే సమయంలో వైసీపీ ఆశించినట్లు సానుకూలత కూడా ప్రజల్లో లేదని స్పష్టమయింది. అందుకే జగన్ ముందు జాగ్రత్తగా ఇక ప్రజల్లో ఉండాలని భావిస్తున్నారు. తన పాలనపై అసంతృప్తి మొదలైన యువత, ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత రాకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాబోయే మూడేళ్ల పాటు జగన్ పాలనలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

Tags:    

Similar News