జగన్  ను కిషన్ కలిసింది అందుకేనా?

ఏపీలో ఒక అనూహ్య సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీకి చెందిన అగ్ర నేత. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటిని వెళ్ళి [more]

;

Update: 2021-08-21 13:30 GMT

ఏపీలో ఒక అనూహ్య సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీకి చెందిన అగ్ర నేత. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటిని వెళ్ళి ఆతీధ్యాన్ని స్వీకరించడం. నిజంగా ఇది ఏపీ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఆయన పార్టీ కార్యక్రమం మీదనే ఏపీలో పర్యటించారు. జన ఆశీర్వాద యాత్ర పేరిట ఆయన ఏపీలో సభ పెట్టి వైసీపీని తెగనాడారు, అదే సమయంలో బీజేపీ ప్రభుత్వాన్ని పొగిడారు. ఇలా ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన ఆయన సడెన్ గా జగన్ ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు. జగన్ సైతం ఆయన్ని సాదరంగా ఆహ్వానించి ముచ్చట్లు పెట్టారు.

పసుపు శిబిరంలో కలవరం…

ఏపీలో చోటు చేసుకున్న ఈ పరిణామంతో తెలుగుదేశం ఉలిక్కిపడింది. ఎందుకంటే అటు జగన్ కి బీజేపీ మధ్య బాగా చెడింది అని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మాత్రం సందు దొరికితే చాలు దూరిపోవచ్చు అని కూడా ఎత్తులు వేస్తోంది. ఏది ఏమైనా జగన్ బలం పెరగకుండా చూడాలి అంటే ఢిల్లీ బంధం తెంచేయాలి అన్నదే టీడీపీ వ్యూహకర్తల ప్లాన్. ఆగస్ట్ నెల మొదలవుతూనే అలాంటి హీట్ కనిపించింది, వైసీపీ మంత్రి పేర్ని నాని అయితే బీజేపీ తమ సర్కార్ ని కూలదోస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. అలా అటూ ఇటూ కూడా విమర్శల పర్వం సాగిన తరువాత ఇక తెగేదాకా లాగేశారు పుటుక్కుమనడమే అని టీడీపీ అనుకుంటోంది. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది మరి.

మోడీకి ఇష్టుడు ….

వెంకయ్యనాయుడు శిష్యుడిగా బీజేపీ రాజకీయాల్లో ఎదిగిన కిషన్ రెడ్డి మోడీకి ఇష్టుడు అని చెబుతారు. అందుకే ఆయనను ఏకంగా కేంద్ర క్యాబినెట్ మంత్రిగా నియమించారు. ఏపీకి ప్రత్యేకించి కేంద్ర మంత్రి లేరు. దాంతో కిషన్ రెడ్డి ఇక్కడ పార్టీ వ్యవహారాలను ఒక కంట కనిపెట్టాల్సిందే. అదే సమయంలో ఢిల్లీ పెద్దలకు ఆయన ద్వారానే పూర్తి సమాచారం కూడా అందుతుంది. తెలుగు మంత్రి అయిన ఆయన సూచనలు కూడా బీజేపీ పట్టించుకుంటుంది అన్నది వాస్తవం. ఇపుడు అలాంటి కిషన్ రెడ్డి జగన్ తో కరచాలనం చేయడం అంటే మండిపోతోంది ప్రత్యర్ధి పార్టీ.

షాక్ ఇచ్చారా …?

వియ్యం కయ్యంగా మారాలి. అది కళ్లారా చూడాలి అని ఆశించిన టీడీపీకి ఇపుడు ఆశాభంగమే అయిందనుకోవాలి. కిషన్ రెడ్డి, జగన్ భేటీ అయిన తరువాత టీడీపీ అనుకూల మీడియా రాసిన రాతలు చూస్తే సైకిల్ పార్టీ అసహనం అందులో కనిపిస్తోంది. నిజానికి బీజేపీ జగన్ని ఏమీ చేయదు అని విశ్లేషకులు కూడా చెబుతారు. జగన్ నమ్మకమైన మిత్రుడిగానే వారు చూస్తారు. ఆయన కోరిన తీరున సాయం చేయకపోయినా ఆయన మీద భారీ యాక్షన్ ప్లాన్ చేసి టీడీపీకి మాత్రం అవకాశం ఇవ్వరనే అంటారు. ఇక ఏపీలో జగన్ బలం కూడా ఢిల్లీ పెద్దలకు తెలుసు. ఇపుడు ఏపీ రాజకీయ పార్టీలకు అర్ధమైన మరో విషయం ఏంటి అంటే జగన్ కి కూడా బీజేపీలో మంచి మిత్రులు ఉన్నారని. అది తట్టుకోవడం బహుశా టీడీపీకి కష్టమే కావచ్చు.

Tags:    

Similar News