జగన్ ఆ పార్టీని ఎంత లేపుదామనుకున్నా…?
ఏపీ రాజకీయాలు చాలా భిన్నంగా సాగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణా రాజకీయాలకు పూర్తి యాంటీగా ఉన్నాయి. తెలంగాణాలో కేసీఆర్ కొరుకుడు పడని రాజకీయ నేత. పైగా [more]
;
ఏపీ రాజకీయాలు చాలా భిన్నంగా సాగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణా రాజకీయాలకు పూర్తి యాంటీగా ఉన్నాయి. తెలంగాణాలో కేసీఆర్ కొరుకుడు పడని రాజకీయ నేత. పైగా [more]
ఏపీ రాజకీయాలు చాలా భిన్నంగా సాగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణా రాజకీయాలకు పూర్తి యాంటీగా ఉన్నాయి. తెలంగాణాలో కేసీఆర్ కొరుకుడు పడని రాజకీయ నేత. పైగా రాజకీయంగా మంచి వ్యూహకర్త. దాంతో అక్కడి విపక్షాలు మొత్తం ఆయన్ని టార్గెట్ చేశాయి. అయితే కేసీఆర్ కి కొందరు మిత్రులు ఉన్నారు. ఎంఐఎం లాంటి పార్టీలతో దోస్తీ ఉంది. అయితే కేసీఆర్ గద్దె దిగితే ఎక్కాలని కోరుకునే పార్టీలు రెండు ఉన్నాయి. ఆ రెండూ జాతీయ పార్టీలు కావడం కేసీఆర్ చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీ ఎప్పటికీ కలవవు, ఎక్కడా తగ్గవు. దాంతో ఎలా అనుకున్నా తెలంగాణాలో ముఖా ముఖీ పోరు ఎపుడూ ఉండదు అదే ఆయనకు శ్రీరామ రక్షగా ఉంది.
గట్టి పోరే మరి …
ఏపీలో చూసుకుంటే రెండు గట్టి ప్రాంతీయ పార్టీల మధ్య పోరు సాగుతోంది. అందులో ఒకటైన తెలుగుదేశం ఢక్కా మెక్కీలు తిన్న పార్టీ. ఇక కొత్తగా వచ్చిన మరో ప్రాంతీయ పార్టీ జనసేన కూడా వైసీపీ మీద కత్తులు దూసేదే. ఆ పార్టీకి కూడా ఎంతో కొంత అస్థిత్వం ఉంది. రెండు జాతీయ పార్టీల తీరు చూస్తే ఏపీలో ఎక్కడా ఉనికి లేనివిగానే జనం తేల్చేశారు. ఇక వామపక్షాల సీన్ కూడా అంతే. చిత్రమేంటి అంటే అధికార వైసీపీకి ఏ ఒక్క విపక్ష పార్టీతో దోస్తీ లేదు. పైగా చంద్రబాబు రింగ్ మాస్టర్ లా అన్ని పార్టీలను ఆడించే టాలెంట్ ఉన్న వారు. దాంతో ఏపీలో జగన్ కి చాలా ఇబ్బందులే ఎదురవుతున్నాయి.
అదే మేలుగా …?
అయితే ఏపీలో విపక్షాలు చీలిపోతేనే అధికార పార్టీకి ఎపుడూ మేలు. కానీ 2024 ఎన్నికల రాజకీయం మాత్రం చూడబోతే అలా అసలు జరిగేలా లేదు. చంద్రబాబు మొత్తం విపక్షాలను ఏకం చేసి జగన్ మీదకు దండెత్తి రావాలనుకుంటున్నారు. దానికి మిగిలిన వాటి నుంచి పెద్దగా వ్యతిరేకత ఉండే చాన్సే లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ ఉండదు అంతే. మరో వైపు చూస్తే జగన్ కూడా కొత్త వ్యూహాలకు పదులు పెడుతున్నారు. ఆయన బీజేపీకి పొలిటికల్ గా మార్కెట్ చేసి పెట్టాలని అనుకుంటున్నారు. ఏపీలో బీజేపీ ఎంత ఎదిగినా జగన్ కి వచ్చిన ముప్పు అసలు లేదు. పైగా ఆ పార్టీ చీల్చేది ఫక్తు టీడీపీ ఓట్లే. దాంతో త్రిముఖ బహుముఖ పోటీలు ఏపీలో ఏర్పడి తనకు ఫుల్ అడ్వాంటేజ్ అవుతుంది అని లెక్కలు వేస్తున్నారు.
వర్కౌట్ అయ్యేనా ..?
ఈ మధ్యన జగన్ పూర్తిగా ఫోకస్ పెట్టింది బీజేపీ మీదనే. తన మంత్రుల ద్వారా బీజేపీని తెగ తిట్టిస్తున్నారు. అలా జనం ఫోకస్ బీజేపీ మీదకు మళ్ళాలి అన్నదే ప్లాన్. ఏపీలో వైసీపీకి అసలైన పోటీదారు బీజేపీ అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికే వైసీపీ నానా తంటాలు పడుతోంది. అయితే ఇక్కడ జగన్ వ్యూహాలకు తగిన విధంగా బీజేపీ నుంచి యాక్షన్ లేకపోవడమే ఇబ్బందిగా చెప్పుకోవాలి. ఎంత లేపాలనుకున్నా బీజేపీ పైకి లేవడంలేదు. కనీసం ఏపీలో బీజేపీ అయిదారు శాతం ఓట్లు చీల్చుకునేలా ఉంటే రేపటి ఎన్నికల్లో వైసీపీకి అది లాభం కలిగించేలా ఉంటుంది. బీజేపీ కూడా కొంత మెరుగుపడితే టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటుంది. ఇలాంటి అంచనాలతో జగన్ ఉన్నారు. మొత్తానికి జగన్ కోరుకునేది ఏపీలో బహుముఖ పోటీలు. మరి అది జరిగే పనేనా. టీడీపీ ఓట్లను చీల్చడం సాధ్యమేనా. చూడాలి.