జగన్ సిమ్లా పర్యటనలో ఉంటే.. ఇక్కడ?
ప్రస్తుతం సీఎం జగన్ సిమ్లా పర్యటనకు ఫ్యామిలీతో వెళ్లారు. మరి ఇప్పుడు ఆయన వచ్చే ఎవరు పాలనను చూస్తారు ? అధికారులను, పాలనను ఎవరు నడిపిస్తారు? అదే [more]
;
ప్రస్తుతం సీఎం జగన్ సిమ్లా పర్యటనకు ఫ్యామిలీతో వెళ్లారు. మరి ఇప్పుడు ఆయన వచ్చే ఎవరు పాలనను చూస్తారు ? అధికారులను, పాలనను ఎవరు నడిపిస్తారు? అదే [more]
ప్రస్తుతం సీఎం జగన్ సిమ్లా పర్యటనకు ఫ్యామిలీతో వెళ్లారు. మరి ఇప్పుడు ఆయన వచ్చే ఎవరు పాలనను చూస్తారు ? అధికారులను, పాలనను ఎవరు నడిపిస్తారు? అదే సమయంలో తలెత్తే సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు ? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న చర్చ. ముఖ్యమంత్రి జగన్ తన బాధ్యతలను ఎవరికి అప్పగించారు ? అనేది కూడా ఆసక్తిగా మారింది. ఈ విషయంపై రెండు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒకటి.. పాలన పరంగా పూర్తి బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు అప్పగించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం.. పార్టీ….
ఇక, రాజకీయంగా, పార్టీ పరంగా తలెత్తే సమస్యలను.. పరిష్కరించడంతోపాటు.. పార్టీని ముందుకు నడి పించే బాధ్యతలను ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారని అంటున్నారు. అయితే.. వాస్తానికి ఇప్పటికే ఆయన సర్వం తానై వ్యవహరిస్తున్నారు. ఇక, ఇప్పుడు సీఎం లేక పోవడంతో.. ఇకపై మొత్తం అన్ని వ్యవహారాలను ఆయనే చక్కబెట్టనున్నారని అంటున్నారు. ఇదే జరిగితే.. జగన్ వచ్చే లోపు.. ఏమైనా మార్పులు జరుగుతాయా ? సజ్జల వర్గంగా పేరున్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోవడం ఖాయమా ? అనే సందేహాలు కూడా తెరమీదికి వస్తున్నాయి.
అక్కడి నుంచే జగన్….
ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు.. సజ్జలకు పూర్తిగా బాధ్యతలు అప్పగించినా ఎప్పటికప్పుడు జగన్ వాటిని సమీక్షించుకుంటున్నారు. జగన్ ఎంత సమీక్షలు చేసుకున్నా చాలా మంది అధికారులు సజ్జల కంట్రోల్లో ఉంటోన్న మాట వాస్తవం. అందుకే ఎంతగా పర్యవేక్షించినా.. సజ్జల చక్రం తిప్పడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక, ఇదే సమయంలో సజ్జల వర్గంగా పేరున్న కొందరు ఎమ్మెల్యేలు కూడా ఆయన అండతో ఈ రెండేళ్లలో మరంతగా దూకుడు పెంచుతారని అంటున్నారు.
సజ్జలదే కీ రోల్….
వచ్చే మంత్రి వర్గ ప్రక్షాళన కావచ్చు.. చివరి రెండేళ్ల పాలన.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు లాంటి విషయాల్లో సజ్జలదే పూర్తి కీ రోల్ కానుంది. జగన్ పూర్తిగా ఆయన మీదనే ఆధారపడాల్సి వస్తోంది. మరో నమ్మకమైన నేత లేకపోవడం, ఫీడ్ బ్యాక్ ఆయన నుంచే వస్తుండటంతో సజ్జలకు జగన్ ప్రయారిటీ ఇవ్వక తప్పని పరిస్థితి. ఏదేమైనా.. సీఎం జగన్ సిమ్లా పర్యటన.. రాజకీయాల పైకూడా ప్రభావం చూపించడం ఖాయం.