జగన్ అనుకున్నదొకటి.. అవుతుంది మరొకటి…?

గ్రామ, వార్డు సచివాలయాలు కాన్సెప్ట్ జగన్ బ్రైన్ చైల్డ్. దేశంలో ఎవరూ తలవని విషయం ఇది. ఎవరు బుర్రకు తట్టని ఆలోచన కూడా ఇదే. దీని మీద [more]

;

Update: 2021-08-29 15:30 GMT

గ్రామ, వార్డు సచివాలయాలు కాన్సెప్ట్ జగన్ బ్రైన్ చైల్డ్. దేశంలో ఎవరూ తలవని విషయం ఇది. ఎవరు బుర్రకు తట్టని ఆలోచన కూడా ఇదే. దీని మీద తరువాత కాలంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కొన్ని రాష్ట్రాలు అయితే అమలు చేయాలని భావించాయి కూడా. ఒక విధంగా జగన్ మార్క్ పాలనకు అద్దం పట్టేలా సచివాలాయాలు ఏపీ నిండా వేలలో ఉన్నాయి. అందులో లక్షల్లో ఉద్యోగాలు కూడా ఇచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత చూస్తే దీన్ని ఒక ఉద్యోగ విప్లవంగా కూడా చెప్పుకోవాలి. అలాంటి సచివాలయాలు జగన్ మనసుకు దగ్గరగా ఉంటాయని అంటారు. ఇపుడు ఇపుడు మాత్రం అక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

జగన్ సారూ ….

జగన్ సారూ మా బాధలకు కారణం మీరే అంటూ ఈ మధ్యనే ఒక వాలంటీర్ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనే కాదు విజయన‌గరం జిల్లాలో మరొకరు, సీమ జిల్లాల్లో ఇంకొకరు ఇలా వరసగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చాలా మంది వాలంటీర్లు చెప్పుకోలేని వత్తిళ్లకు గురి అవుతున్నారు. అసలు ఎందుకిలా జరుగుతోంది సచివాలయాలలో ఏం జరుగుతోంది అన్నది వైసీపీ సర్కార్ పట్టించుకుంటోందా అన్నదే డౌట్ గా ఉంది. నిజానికి జగన్ ఎంతగానే ప్రేమించే ఈ వ్యవస్థ ఇపుడు జగన్ ని ఎందుకు అన్నిబాధలకు కలిపి మరీ బాధ్యుడిని చేస్తోంది అన్నదే చూడాలి.

జీతాలు లేవా…?

సచివాలయంలో అయిదు వేల రూపాయల జీతం తీసుకునే వాలంటీర్ల చేత గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు వారిని సేవకులుగానే చూస్తాం తప్ప ప్రభుత్వ ఉద్యోగులుగా చూడమని చెప్పేశారు. అది వారిలో తెలియని బాధగా మారుతోంది. వీటికి తోడు అన్నట్లుగా సేవకుడు, గౌరవ వేతనం అయినా చాకిరీ మాత్రం తప్పడంలేదు అని వారు మండిపోతున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే సచివాలయాలలో పనిచేసే సెక్రటరీస్, అడ్మిన్ ఇతర ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు లేవు. పైగా వారు ఈ ఉద్యోగాలలో చేరాక రెండేళ్లకు ప్రోబేషన్ ఇస్తామని చెప్పారు. ఇపుడు పరీక్షలు పాస్ కావాలి. ఇంకా ఏవో చేయాలి అని కొత్త కండిషన్లు పెడుతున్నారు. దాంతో వారంతా ఏంటి బాధ తమకు అని ఆవేదన చెందుతున్నారు.

దెబ్బ మీద దెబ్బ….

పిచిక మీద బ్రహ్మాస్త్రం అంటారు. అవును సచివాలయ ఉద్యోగులకు ఇచ్చే జీతం కేవలం పదిహేను వేలు మాత్రమే. అది కూడా వారు సెలవు పెడితే జీతం కట్. ఇక వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు కానీ వారి వద్ద నుంచి బలవంతంగా తెల్ల రేషన్ కార్డులను లాగేసుకుంటున్నారు. వారికి ఏ ఒక్క సంక్షేమ పధకం అమలు కాకుండా చూస్తున్నారు. ఈ కరువు రోజులలో కరోనా రోజులలో పదిహేను వేలు చాలీ చాలని జీతంతో బతకడం అంటే ఎలా జగన్ సారూ అంటున్నారు వారంతా. పోనీ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఫుల్ శాలరీ ఇచ్చాక తామే తెల్ల రేషన్ కార్డు వదులుకుంటాము కదా అని వారు చెబుతున్నారు. అయితే వారికి పరీక్ష నిర్వహించి ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తామని ప్రభుత్వం చెబుతోంది

పధకాలు దక్కక ….

మరో వైపు చూస్తే ఏపీలో లక్షల మంది పేదలకు ఇళ్ళ నిర్మాణం అంటోంది జగన్ సర్కార్. కానీ సచివాలయ ఉద్యోగులకు మాత్రం అందులో చోటు లేదు. అంటే వీరి పరిస్థితి త్రిశంకు స్వర్గం అన్న మాట. ఇక వీరు ఈ ఉద్యోగాలలో చేరాక మరెక్కడా చేరకూడదని ఇక్కడే కొన్నాళ్ళ పాటు పనిచేస్తామని ప్రమాణ పత్రాలపైన రాయించుకున్నారు. దాంతో తాము ఒక వైపు ఏజ్ బార్ అయిపోయి మరో వైపు బయట అవకాశాలు కూడా కోల్పోతున్నామని విలపిస్తున్నారు. మొత్తానికి జగన్ మంచి ఆశయంతో పెట్టిన సచివాయల వ్యస్థ అందులో పనిచేసేవారికి మాత్రం తీరని అవస్థగానే మారిందట. ఇకనైనా జగన్ కలుగచేసుకోకపోతే రేపు సీన్ మొత్తం రివర్స్ అవుతుంది అంటున్నారు.

Tags:    

Similar News