చూపులు ల్లేవ్…. మాట్లాడుకోటాల్లేవ్
రాజకీయాల్లో కుటుంబమంతా కలసి ఒకే బాటలో నడవడమనేది చాలా అరుదుగా కన్పిస్తుంది. ఇందిరాగాంధీ కుటుంబం నుంచి తీసుకుంటే రాజకీయాలు కుటుంబంలో విభేదాలు సృష్టిస్తాయనే చెప్పాలి. అధికారంలో రాకముందు [more]
;
రాజకీయాల్లో కుటుంబమంతా కలసి ఒకే బాటలో నడవడమనేది చాలా అరుదుగా కన్పిస్తుంది. ఇందిరాగాంధీ కుటుంబం నుంచి తీసుకుంటే రాజకీయాలు కుటుంబంలో విభేదాలు సృష్టిస్తాయనే చెప్పాలి. అధికారంలో రాకముందు [more]
రాజకీయాల్లో కుటుంబమంతా కలసి ఒకే బాటలో నడవడమనేది చాలా అరుదుగా కన్పిస్తుంది. ఇందిరాగాంధీ కుటుంబం నుంచి తీసుకుంటే రాజకీయాలు కుటుంబంలో విభేదాలు సృష్టిస్తాయనే చెప్పాలి. అధికారంలో రాకముందు వరకూ కలసి ఉన్న వారు పవర్ చేతికి చిక్కగానే చీలిక ఏర్పడటం సర్వసాధారణమయింది. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మినహాయింపు కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నంత కాలం కుటుంబమంతా ఒకతాటిపై నడిచింది.
కష్టాల్లో ఉన్నప్పుడు….
ఆయన మరణం తర్వాత కూడా జగన్ జైలు పాలయినప్పుడు, కొత్త పార్టీ పెట్టినప్పుడు, ఎన్నికల బరిలోకి దిగినప్పుడు అంతా ఒక్కటై నిలిచారు. జగన్ కు అండగా నిలిచారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఆ కుటుంబంలో పరిస్థితులు మారిపోయాయి. అధికారం కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టిందనే చెప్పాలి. జగన్, వైఎస్ షర్మిల మధ్య ఏర్పడిన బేదాభిప్రాయాల వల్లనే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడానికి కారణంగా చెప్పాలి.
అందరికీ ఆదర్శంగా….
ఇక అన్నా చెల్లెల్లు గతంలో అందరికీ ఆదర్శంగా నిలిచే వారు. అన్నమాట జవదాటని చెల్లెలుగా షర్మిల, చెల్లి తన ఆరో ప్రాణంగా జగన్ భావించే వారు. కానీ ఇప్పుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకునే పరిస్థితి కన్పించలేదు. గతంలో వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఇద్దరూ వేర్వేరుగా వచ్చి నివాళులర్పించి వెళ్లిపోయారు. ప్రతి ఏటా రాఖీ సందర్భంగా కలిసే అన్నా చెల్లెల్లు ఈసారి పండగకు దూరంగా ఉన్నారు. విషెస్ కే పరిమితమయ్యారు.
ఎదురుపడటానికి కూడా…?
ఇప్పుడు తాజాగా వైఎస్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయకు ఇద్దరు ఒకేరోజు వచ్చినా ఒకరినొకరు పలకరించుకోలేదు. కనీసం ఒకరినొకరు చూసుకునేందుకు కూడా ఇష్టపడలేదు. జగన్, షర్మిల పక్కనే కూర్చుని నివాళులర్పించి వెళ్లిపోయారు. రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్ కు అభిమానులున్నారు. వారందరూ ఈ ఘటన చూసి ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్ ఫ్యామిలీలో ఈ చీలిక ఎందుకు వచ్చిందా? అని మదన పడుతున్నారు.