వాళ్లకు కేబినెట్ లో నో ఛాన్స్ అట
జగన్ తొలి నుంచి ఒక మాట అంటే దాని మీద నిలబడతారు. తనను అధికారంలోకి తెచ్చిందే ఈ మనస్తత్వం అని నమ్ముతారు. అందుకే ఒకసారి డెసిషన్ తీసుకుంటే [more]
;
జగన్ తొలి నుంచి ఒక మాట అంటే దాని మీద నిలబడతారు. తనను అధికారంలోకి తెచ్చిందే ఈ మనస్తత్వం అని నమ్ముతారు. అందుకే ఒకసారి డెసిషన్ తీసుకుంటే [more]
జగన్ తొలి నుంచి ఒక మాట అంటే దాని మీద నిలబడతారు. తనను అధికారంలోకి తెచ్చిందే ఈ మనస్తత్వం అని నమ్ముతారు. అందుకే ఒకసారి డెసిషన్ తీసుకుంటే దానికి వెనక్కు తీసుకోరు. తన పరిధిలో ఉన్న అంశాల్లో మాత్రం జగన్ ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది అన్నది పక్కన పెడితే జగన్ మనసులో ఏముందన్నది ఎవరికీ తెలియదు. చివరి నిమిషంలో గాని మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్నది బయట ప్రపంచానికి తెలియదు.
ప్రయత్నాలు చేస్తున్నా….
పార్టీలో సీనియర్ నేతలకు కూడా ఈ విషయం తెలిసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే తన మంత్రి వర్గ విస్తరణలో జగన్ ఎవరి సలహాలు తీసుకోరు. తాను అనుకున్న సామాజిక సమీకరణల ఆధారంగానే జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపడతారు. అయితే ఇప్పడు రాష్ట్రంలో రానున్న మంత్రి వర్గ విస్తరణలో చోటు సంపాదించేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు జగన్ వద్ద చెల్లుబాటు కావన్నది కూడా నిజమే.
కొందరు ఎమ్మెల్సీలు…
ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, మహ్మద్ ఇక్బాల్ పేర్లు విన్పిస్తున్నాయి. దీంతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ పేరు కూడా బలంగా విన్పిస్తుంది. మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీని చేసి జగన్ మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. వీరితో పాటు ఇటీవల ఎమ్మెల్సీలుగా నియమితులైన మరికొందరు సీనియర్ నేతలు కూడా జగన్ దృష్టి తమపై పడేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
అవకాశమే లేదట….
కానీ జగన్ ఎమ్మెల్సీలకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు. దీనికి బలమైన కారణం శాసనమండలిని రద్దు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించడమే. శాసనమండలి రద్దు కేంద్రం చేతిలో ఉంది. అది రద్దు అవుతుందో? లేదో? తెలియదు. అదే సమయంలో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను మంత్రి పదవికి రాజీనామాలు చేయించి రాజ్యసభకు పంపారు. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సో… ఎమ్మెల్సీలు ఎవరూ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకోక పోవడమే బెటర్.