పొర్లు దండాలు పెట్టినా దక్కదు టికెట్… ?
విద్యార్ధికి ప్రతీ ఏటా పరీక్ష ఉంటే రాజకీయ నేతకు అయిదేళ్ళకు ఒకసారి పరీక్ష ఉంటుంది. ఎమ్మెల్యే అయిన వారు పదే పదే తామే కొనసాగాలనుకుంటారు. అందుకోసం అధినేత [more]
;
విద్యార్ధికి ప్రతీ ఏటా పరీక్ష ఉంటే రాజకీయ నేతకు అయిదేళ్ళకు ఒకసారి పరీక్ష ఉంటుంది. ఎమ్మెల్యే అయిన వారు పదే పదే తామే కొనసాగాలనుకుంటారు. అందుకోసం అధినేత [more]
విద్యార్ధికి ప్రతీ ఏటా పరీక్ష ఉంటే రాజకీయ నేతకు అయిదేళ్ళకు ఒకసారి పరీక్ష ఉంటుంది. ఎమ్మెల్యే అయిన వారు పదే పదే తామే కొనసాగాలనుకుంటారు. అందుకోసం అధినేత ప్రాపకం కోసం తపన పడతారు. అయితే నాయకుడి చుట్టూ తిరిగితే టికెట్లు దక్కడం అన్నది పాత ట్రెండ్. టికెట్ కావాలి తామే మళ్లీ ఎమ్మెల్యే కావాలి అంటే ఉండాల్సిన చోట ఉండాలి మరి. అంటే తన నియోజకవర్గంలో జనాలకు చేరువగా ఉంటూ వారి మంచీ చెడ్డా చూసుకుంటే చూసుకున్న వారికే జనమూ వరమాల వేస్తారు. అధినాయకుడూ టికెట్ ఇస్తాడు. ఇపుడు వైసీపీ అయినా టీడీపీ అయినా ఇదే ట్రెండ్ అంటున్నారు.
జగన్ దేవుడన్నా..?
వచ్చే ఎన్నికల గురించి అపుడే మెల్లగా ఏపీలో రాజకీయ జ్వరం మొదలైంది. సగం పాలన పూర్తి కావడంతో అధికార వైసీపీ జాగ్రత్త పడుతూంటే ఈసారి తప్పులు అసలు చేయరాదు అనుకుంటోంది టీడీపీ. ఈ నేపధ్యంలో రెండు పార్టీలు కూడా సర్వేశ్వరులనే నమ్ముకున్నాయి. అధికార వైసీపీ ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తోంది. ప్రభుత్వ పనితీరుతో పాటు ఎమ్మెల్యేల పనితీరు మీద నివేదికలు జగన్ చేతికి అందుతున్నాయి. వాటిని బట్టే ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎవరు పనిమంతులు అన్న క్లారిటీ జగన్ కి పక్కాగా ఉందని చెబుతున్నారు. అందుకే జగన్ దేవుడు అంటూ మీడియా ముందు ఎమ్మెల్యేలు స్తోత్రపాఠాలు వల్లించినా కూడా ఆయన కరుణించేది ఉండదు అంటున్నారు.
టోటల్ చేంజ్…
ఈసారి చాలా చోట్ల సిట్టింగుల సీట్లు మారిపోతాయని అంటున్నారు. జగన్ ఈ విషయంలో ఎవరి మాట వినే ప్రసక్తి లేదని చెబుతున్నారు. ఆయన పగడ్బందీగా సర్వేలు చేయిస్తున్నారు. ఒకటి కారు రెండు మూడు ఏజెన్సీల నుంచి కూడా నివేదికలు కోరుతున్నారు. వాటిలో మేలి ముత్యంగా బయటపడిన వారికే టికెట్లు దక్కుతాయని అంటున్నారు. అంటే జగన్ టికెట్ ఇవ్వాలి అంటే సర్వేలో ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాల్సిందే అన్న మాట. ఈ విషయం తెలియడంతోనే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయట. జగన్నో, ఆ పక్క నున్న వారినీ అశ్రయించి టికెట్ పట్టేద్దామంటే ఈసారి అసలు కుదిరే వ్యవహారం కానే కాదని కూడా తేలిపోతున్న సత్యం.
సీమ నుంచి మొదలు…
ఇక రాయలసీమ నుంచి మొదలుపెడితే ఉత్రరాంధ్రాలోని చిట్టచివరి జిల్లా శ్రీకాకుళం దాకా జగన్ సర్వేలనే నమ్ముకున్నారుట. ఎమ్మెల్యేగా ఎవరు తాము తోపు అనుకున్నా కూడా జగన్ దగ్గర పప్పులు ఉడికే ప్రసక్తే లేదని అంటున్నారు. ప్రస్తుతం జగన్ వద్ద ఉన్న నివేదికలు చూసుకుంటేనే యాభై నుంచి అరవై మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవుట్ అని తేలుతోంది. త్వరలో వారందరికీ పిలిచి జగన్ క్లాస్ తీసుకుంటారని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సగం సమయం ఉన్నందువల్ల ఎవరైనా తమ పనితీరు మార్చుకుంటే ఓకే. లేకపోతే మాత్రం నిర్దాక్షీణ్యంగా తప్పించేసి మరీ కొత్తవారికి అక్కడ టికెట్ ఇస్తారుట. అందువల్ల వైసీపీ ఎమ్మెల్యేల ఫ్యూచర్ తాడేపల్లిలోని జగన్ దగ్గర లేదని, నేడు పనిచేయకుండా ఎన్నికల వేళ పొర్లు దండాలు పెట్టినా టికెట్ దక్కదు కాక దక్కదు అని అంటున్నారు. మరి చూడాలి జగన్ మార్క్ సర్వే రాజకీయానికి ఎంతమంది ఎమ్మెల్యేలు బలి అవుతారో.