జగన్ లెక్కలు పక్కాయేనా…. ?
ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల రాజకీయమే ముఖ్యం. అధినాయకుడు ఎపుడూ గెలుపు గుర్రం ఎక్కడానికే చూస్తాడు. ఆ మాటకు వస్తే జగన్ అయినా చంద్రబాబు అయినా అదే [more]
;
ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల రాజకీయమే ముఖ్యం. అధినాయకుడు ఎపుడూ గెలుపు గుర్రం ఎక్కడానికే చూస్తాడు. ఆ మాటకు వస్తే జగన్ అయినా చంద్రబాబు అయినా అదే [more]
ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల రాజకీయమే ముఖ్యం. అధినాయకుడు ఎపుడూ గెలుపు గుర్రం ఎక్కడానికే చూస్తాడు. ఆ మాటకు వస్తే జగన్ అయినా చంద్రబాబు అయినా అదే విధంగా ఆలోచిస్తారు. జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తనదైన వ్యూహాలను రచిస్తారు అన్నది వాస్తవం. ముప్పయ్యేళ్ళు సీఎం గా ఉంటాను అని గట్టిగా చెప్పిన జగన్ ఆ దిశగా ఆలోచించరు అంటే ఎవరైనా నమ్ముతారా. ఇక జగన్ ఏపీ రాజకీయాన్ని మొత్తం ఔపోశన పట్టేశారు అనుకోవాలి. అందుకే ఆయన ధీమాగా ఉన్నారనే అంటున్నారు.
మరీ అంత సులువా?
జగన్ ని ఓడించడం అంటే అంత సులువా అన్న మాట ఉంది. ఎందుకంటే జగన్ అలా ఇలా గెలవలేదు. 151 సీట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా ప్రత్యర్ధులే లేకుండా అధికార రధాన్ని పరుగులు పెట్టించాలనుకుంటున్నారు. మరి జగన్ ఓడిపోతారు. మనదే విజయం అని తెలుగుదేశం అనుకున్నా లేక ఇతర పార్టీలు భావించినా కూడా అది అంచనా లేని ఆలోచనగానే మిగులుతుంది అంటున్నారు. జగన్ మీద జనాల మోజు ఆకాశాన్ని అంటేలా 2019లో ఉంది. అందులో కొంత వచ్చే ఎన్నికల్లో తగ్గినా కూడా వందకు పైగా సీట్లను జగన్ గెలుచుకోవడం సాధ్యమే అంటున్నారు ఆ పార్టీ నేతలు.
బాబు అంటే..?
ఇక చంద్రబాబు అంటే ఏంటో జనాలు చూసేశారు. 2024 నాటికి యువ ఓటర్లు కూడా ఏపీ నిండా వచ్చి చేరుతారు. అప్పటికి రాజకీయంగా జగనే యువకుడిగా ఉంటారు. మరి బాబు కూడా కొత్త తరానికి కనెక్ట్ కావడం అంటే అంత ఈజీ కాదు, పైగా బాబు అవుట్ డేటెడ్ పాలిటిక్స్ చేస్తారని పేరు ఉంది. ఆయన రొడ్డకొట్టుడు ఉపన్యాసాలకు యువతరం పడిపోతుందా అన్నది అతి పెద్ద డౌట్. ఇక జగన్ ఏం చేయకపోయినా సంక్షేమం అంటున్నారు. ఇక ఎన్నికల నాటికి పోలవరం లాంటివి పూర్తి చేసుకున్నా ఆయనకు ప్లస్ గానే ఉంటుంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఇస్తున్న జగన్ ఎన్నికల నాటికి వారిని పెర్మెనెంట్ చేస్తే యువత ఆయన వైపు చూడడం ఖాయం.
కసి అలా …?
జగన్ లో కసి ఉంది. అదే ఆయన్ని ఒక ఎంపీ గా ఉన్న ప్లేస్ నుంచి సీఎం కుర్చీ దాకా చేర్చింది. ఇపుడు విపక్షాలు గట్ట్టిగా గర్జించినా లేక ఆయన ముప్పయ్యేళ్ల అధికార రధానికి అడ్డంకులు సృష్టించిన జగన్ లో కసి ఊరుకుంటుందా. ఆయన చేయాల్సినవి చేస్తారు. మళ్ళీ జనం మనసు గెలుచుకోవడానికి ఎంత ప్రయాస అయిన పడతారు. అందువల్ల జగన్ తో పెట్టుకోవడం అంటే కష్టమే. ఆయన లెక్కలు పక్కాగానే ఉంటాయి మరి అంటున్నారు.