జగన్ శత్రువులే మిత్రులట?

రాజకీయాల్లో మిత్రులు శత్రువులు అంటూ వేరేగా ఉండరు, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఏ పార్టీకి అయినా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఎవరు రాజకీయం చేసినా కూడా [more]

;

Update: 2021-09-09 11:00 GMT

రాజకీయాల్లో మిత్రులు శత్రువులు అంటూ వేరేగా ఉండరు, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఏ పార్టీకి అయినా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఎవరు రాజకీయం చేసినా కూడా అంతిమ లక్ష్యం గెలుపు అన్నది కూడా తెలిసిందే. కానీ ఒక పార్టీ మాత్రం తన గెలుపు సంగతి కూడా పక్కన పెట్టి జగన్ ఓటమిని అంత గట్టిగా కోరుకుంటోందా? అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. అవి కూడా ఈనాటివి కావు. ఎప్పటినుంచో ఉన్నవే. విషయానికి వస్తే జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఎందుకో మొదటి నుంచి జగన్ అంటే పడదు, ఆయన జగన్ పేరెత్తితేనే పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతారు. ఆయన జగన్ ని మచ్చుకు ఒక్క విషయంలో అయినా మెచ్చుకున్న దాఖలాలు లేవు.

ఒక్కటయ్యారు ….

ఇక జగన్ మీద తెల్లారిలేస్తే విరుచుకుపడే రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఉండనే ఉన్నారు. ఆయన ఢిల్లీ కదలి రారు. అక్కడే రచ్చబండను పెర్మనెంట్ గా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతీ రోజూ జగన్ మీద ఆయన చేసే విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఆయనకు చంద్రబాబుకు, టీడీపీఎకి మధ్య ఉన్న బంధం ఏంటి అన్నది ఆ మధ్యన సీబీసీఐడి బయట పెట్టింది. వాట్సప్ సాక్షిగా అవి అందరికీ తెలిసిపోయాయి. ఆ విధంగా రాజు గారు పసుపు వీరుడే సుమా అని లోకం అనుకుంది. కానీ ఇపుడు ఆయనతో పవన్ కళ్యాణ్ కూడా ఫోటోలు దిగడంతో జనసేనానికి కూడా ఆయన బాగా నచ్చేశాడు అనుకోవాలి.

ఆశ్చర్యం కాదు కానీ…?

సహజంగా జగన్ అంటే పవన్ కి పడదు అంటారు. అలాంటిది జగన్ ని పట్టుకుని విమర్శలు చేస్తున్న రాజు గారితో పవన్ ఫోటో దిగినా మంతనాలు జరిపినా అందులో వింతా విశేషం మాత్రం లేదు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమార్తె వివాహానికి పవన్ వెళ్ళినపుడు అక్కడే ఉన్న రాజు గారితో ముచ్చటించినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు కలసి ఉన్న ఫోటోలు కూడా మీడియాలో కనిపించాయి. ఇక ఇద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారు అన్నది కూడా చెప్పాల్సింది లేదు. ఉమ్మడి శత్రువు జగన్ కాబట్టి ఆయన గురించే చర్చించి ఉంటారని అంటున్నారు.

ఇలా చేస్తే మరి…?

పవన్ కళ్యాణ్ ఎంత కాదనుకున్నా చరిష్మాటిక్ లీడర్. ఆయన‌కు కోట్లాదిగా అభిమానులు ఉన్నారు. ఆయన ఒక్క పిలుపు ఇవ్వాలే కానీ అభిమానులు లక్షలాదిగా తరలివస్తారు. పవన్ సవ్యంగా తన రాజకీయం తాను చేసుకుంటే జనసేనకు కూడా ఒక దశ, దిశ ఉంటాయని చెప్పేవారు ఉన్నారు. కానీ పవన్ రాజకీయం చూస్తూంటే తాను సీఎం కాకపోయినా ఫరవాలేదు, జగన్ మాత్రం ముఖ్యమంత్రి గద్దె మీద అసలు ఉండకూడదు అన్నట్లుగా ఉంది మరి. దాంతోనే తేడాలు వచ్చేస్తున్నాయి. రెబెల్ ఎంపీతో పవన్ భేటీ కావడం లాంటివి మంచి సంకేతాలు పంపవు అని కూడా అంటున్నారు. పవన్ సొంతంగా తన రాజకీయం తాను చేయాలి. కానీ ఆయన ఏకైక అజెండా జగన్ బదనాం కావడమే అయినపుడు ఇలాంటి సీన్లు మరిన్ని చూసినా తప్పు లేదు అంటున్నారు అంతా.

Tags:    

Similar News