క్రిస్టియన్ ముఖ్యమంత్రి…ఇంప్రెషన్ గట్టిదే… ?
ఇప్పటిదాకా ఈ రకమైన పదజాలంతో దూషించడం బహుశా భారత దేశ రాజకీయాల్లో ఎవరూ చూసి ఉండరు. అవినీతిపరులు, అక్రమార్కులు అంటూ ముఖ్యమంత్రులను నిందించిన వారు ఉన్నారు. ఒక [more]
;
ఇప్పటిదాకా ఈ రకమైన పదజాలంతో దూషించడం బహుశా భారత దేశ రాజకీయాల్లో ఎవరూ చూసి ఉండరు. అవినీతిపరులు, అక్రమార్కులు అంటూ ముఖ్యమంత్రులను నిందించిన వారు ఉన్నారు. ఒక [more]
ఇప్పటిదాకా ఈ రకమైన పదజాలంతో దూషించడం బహుశా భారత దేశ రాజకీయాల్లో ఎవరూ చూసి ఉండరు. అవినీతిపరులు, అక్రమార్కులు అంటూ ముఖ్యమంత్రులను నిందించిన వారు ఉన్నారు. ఒక ప్రాంతానికే పరిమితమైన వారిని కూడా ఆ గాటకు కట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఏకంగా ఒక మతాన్ని పట్టుకొచ్చి కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి దానికి కట్టేసి విమర్శించడం అంటే నిజంగా రాజకీయ విషాదంగానే చూడాలి. అలాగే పాలిటిక్స్ లో ట్రిక్స్ మరీ ఇంతలా జారుడు మెట్ల మీదకు వెళ్లాయా అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది.
ఇస్తే ఏమైంది…?
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం కోవిడ్ మార్గదర్శకాల ప్రకారమే ఏపీ ప్రభుత్వం వినాయకచవితి ఉత్సవాల మీద నిర్ణయం తీసుకుంది. కేవలం జగన్ ఒక్కరే ఆలాంటి నిర్ణయం తీసుకోలేదు, పక్కన ఉన్న తమిళనాడు కూడా ఇదే రకమైన నిబంధలను పెట్టింది. మరో వైపు ఢిల్లీలో హిందువు అయిన సీఎం కేజ్రీవాల్ కూడా ఇవే నిబంధనలు అమలు పరచారు. మరి వారెవరి మీద లేని ఈ మతం ముద్ర ఒక్క జగన్ మీదనే ఎందుకు వేస్తున్నారు. అంటే జగన్ అంటే అదో రకమైన ద్వేష భావం అయినా ఉండాలి, లేక రాజకీయంగా మతాన్ని అడ్డం పెట్టుకోవాలన్న దురాశ అయినా ఉండాలి.
పరుషమైన భాష….
జగన్ ని పట్టుకుని క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటూ పరుషమైన భాషనే బీజేపీ నేతలు వాడారు. అది ఒక్కసారి కాదు పదే పదే వాడారు. జగన్ వేరే మతస్థుడు అయినందువల్లనే వినాయకచవితి వేడుకలకు అభ్యంతరం పెడుతున్నారని, ఏపీని క్రైస్తవం చేయడానికి చూస్తున్నారని చాలా ఆరోపణలే చేశారు. మరి ఇది మెల్లగా అయినా కూడా జనాల బుర్రల్లోకి చేరాలని, ఫలితాలు తాము దర్జాగా అందుకోవాలని బీజేపీ పెద్దల ఆరాటంగా కనిపిస్తోంది.
నాడు ఏమైంది…?
ఇదిలా ఉంటే చంద్రబాబు టైమ్ లో ఎన్నో అపచరాలు జరిగాయి. నాడు మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ కానీ జనసేన కానీ కనీసం ఖండించలేకపోయాయి. నాడు విజయవాడలో పెద్ద ఎత్తున హిందూ దేవతా విగ్రహాలను కూలగొట్టిన నాడు కూడా వీరి నోట మాట రాలేదు. పైగా దేవాదాయ శాఖ మంత్రి కూడా బీజేపీ వాడే. అంతెందుకు చంద్రబాబు కలల రాజధాని అమరావతిలో వందల కోట్లతో చర్చి కట్టిస్తామని టీడీపీ పెద్దలు భారీ హామీలు ఇచ్చినపుడు కూడా ఇదేమని ప్రశ్నించలేకపోయాయి. కానీ జగన్ విషయంలో అకారణంగా క్రిస్టియన్ ముద్ర వేస్తున్నాయని వైసీపీ నేతలు బాధ పడుతున్నారు. ఒక్కడ ఒక లాజిక్ పాయింట్ ఉంది. జగన్ కే అంత మత పిచ్చి ఉంటే ముందు తన సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని, బంధువు బాలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబాన్ని క్రిస్టియన్ మతంలోకి ఏనాడో మార్పించేవారు కదా. అంతే కాదు, సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఫ్యామిలీని మతం మార్పించేవారే కదా. జగన్ కి అలాంటివి లేవు అనే అంతా అంటారు. ఆ మాటకు వస్తే వైఎస్సార్ కూడా ఇదే రకంగా ఉండేవారు. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ని బదనాం చేయడం ద్వారా అధికారం దక్కుతుంది అని బీజేపీ నేతలు భావిస్తే మాత్రం అంత కంటే పరిహాసం మరోటి ఉండబోదు.