ఈ గండం నుంచి ఎలా బయటపడతారో?

జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయింది. అయితే ఈ రెండున్నరేళ్లలో జగన్ ఏం చేశారన్న దానిపై వైసీపీలోనే చర్చ ప్రారంభమయింది. సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పించి జగన్ [more]

;

Update: 2021-10-10 06:30 GMT

జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయింది. అయితే ఈ రెండున్నరేళ్లలో జగన్ ఏం చేశారన్న దానిపై వైసీపీలోనే చర్చ ప్రారంభమయింది. సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పించి జగన్ రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదన్న విమర్శలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, తన నిర్ణయంతో ఏపీకి రాజధాని లేకుండా పోవడం రాజకీయంగా ఇబ్బంది జగన్ ఎదుర్కొనక తప్పేట్లు లేదు.

ఇంకా రెండేళ్లే…..

జగన్ కు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ రెండేళ్లలో ఆయన అభివృద్ధిని శరవేగంగా జరపాల్సి ఉంటుంది. రోడ్లను బాగు చేయడంతో పాటు పెట్టుబడులను రాష్ట్రానికి తేవాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా పెట్టుబడులు లేక, ఉపాధి అవకాశాలు లభించలేదు. దీంతో విపక్షాలకు జగన్ అవకాశమిచ్చినట్లయింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడుతూ జగన్ రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలున్నాయి.

అభివృద్ధి చేయకుంటే?

ఇప్పుడు ఇక జగన్ దృష్టంతా అభివృద్దిపైనే పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలలో జగన్ ప్రభుత్వంపై పెదవి విరుపులు కన్పిస్తున్నాయి. ఇసుక దొరకకపోవడం, దొరికినా అత్యధిక రేగు కావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు సయితం పనులు చేపట్టేందుకు ముందుకు రాకపోవడం ప్రభుత్వ దుస్థితికి అద్దం పడుతుందని టీడీపీ విమర్శలు చేస్తుంది.

ఈ సమయం కీలకం….

ఈ నేపథ్యంలో ఈ రెండున్నరేళ్లు జగన్ కు అతి కీలకం అనే చెప్పాలి. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుకుంటేనే ఇటు అన్ని వర్గాలను జగన్ సంతృప్తి పర్చాల్సి ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి కూడా ఆయన బయటపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో జగన్ అద్భుతాలు సృష్టిస్తే తప్ప ఈ గండం నుంచి బయట పడటం కష్టమేనంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News