ys jagan : పదవులిచ్చినా పెదవి విరుపులేనా?
రాజకీయ పార్టీ అన్న తర్వాత అసంతృప్తులు సహజం. ఎన్ని పదవులు ఇచ్చినా ఏదో ఒక కారణం వారిలో అసంతృప్తిని రగిలిస్తుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమందికో [more]
రాజకీయ పార్టీ అన్న తర్వాత అసంతృప్తులు సహజం. ఎన్ని పదవులు ఇచ్చినా ఏదో ఒక కారణం వారిలో అసంతృప్తిని రగిలిస్తుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమందికో [more]
రాజకీయ పార్టీ అన్న తర్వాత అసంతృప్తులు సహజం. ఎన్ని పదవులు ఇచ్చినా ఏదో ఒక కారణం వారిలో అసంతృప్తిని రగిలిస్తుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమందికో పదవులను ఇచ్చారు. కొందరు ఊహించని విధంగా మంత్రులయ్యారు. మరికొందరిని పిలిచి మరీ ఎమ్మెల్సీలను చేశారు. అయినా వైసీపీ నేతల్లో అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై పెదవి విప్పేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు.
వన్ మ్యాన్ ఆర్మీగా…
జగన్ వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన వల్లనే వైసీపీ అఖండ విజయం సాధించిందనడంలో సందేహం లేదు. అయితే ఎప్పుడైనా సమిష్టి కృషి ఉంటేనే మరోసారి గెలుపు దక్కుతుంది. జగన్ ఏ పనిచేసినా అది విపక్షాలకు గిట్టదు. దానికి చిలవలు, పలవలు చేర్చి విమర్శలకు దిగుతుంటారు. దిశ చట్టం కావచ్చు. మటన్ మార్ట్ లు, ఇసుక విధానం వంటి నిర్ణయాలపై విపక్షాలు నిత్యం దండెత్తుతున్నాయి.
వాయిస్ ఏదీ?
కానీ ప్రభుత్వం నుంచి సరైన వాయిస్ విన్పించడం లేదు. విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు. విపక్షంలో ఉన్నప్పుడు గళమెత్తిన అంబటి రాంబాబు, రోజా వంటి నేతలు సయితం సైలెంట్ అయ్యారు. దీనికి ప్రధాన కారణం వారిలో అసంతృప్తి అని చెబుతున్నారు. జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు రావడం లేదు. మీడియా సమావేశాల్లో కూడా పాల్గొనడం లేదు.
పెదవి విప్పంది అందుకేనా?
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఖండించాల్సిన పార్టీ నేతలు మౌనంగా ఉండటం దేనికి సంకేతం? మంత్రి వర్గ విస్తరణ ఉండటంతో తమ పదవి అయిపోయిందని కొందరు మంత్రులు మౌనంగా ఉంటున్నారు. ఇక ఎమ్మెల్సీ పదవులు పొందిన వారు సయితం వివాదాల జోలికి పోకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇలాగే ఉంటే విపక్షాల విమర్శలు జనంలో కి బలంగా వెళ్లి పార్టీ బలహీనం కాక తప్పదు. పదవులు పొంది కాలక్షేపం చేస్తున్న వారిని జగన్ ఇకనైనా పక్కన పెట్టాలని పలువురు నేతలు సూచిస్తున్నారు.