Ys jagan : జగన్ కు అడ్వాంటేజీ అదేనా?

జడ్పీలు, ఎంపీపీలు, మున్సిపాలిటీలు వైసీపీ పరమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో వీళ్లంతా ప్రధాన భూమిక పోషించనున్నారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు ఉండనుండటంతో జగన్ కు వచ్చే ఎన్నికలకు [more]

;

Update: 2021-10-01 08:00 GMT

జడ్పీలు, ఎంపీపీలు, మున్సిపాలిటీలు వైసీపీ పరమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో వీళ్లంతా ప్రధాన భూమిక పోషించనున్నారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు ఉండనుండటంతో జగన్ కు వచ్చే ఎన్నికలకు ఎంత ముఖ్యమో వీరికి కూడా అంతే ప్రధానం. అధికారం చేజారిపోతే వీరి పదవులకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఎన్నికైన, నామినేట్ అయిన ప్రజాప్రతినిధులంతా వచ్చే ఎన్నికలలో తెగించి పోరాడాల్సి ఉంటుంది. అందుకే జగన్ పదవుల పందేరాన్ని చేపట్టారు.

రెండున్నరేళ్ల కాలంలో….

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించి రెండున్నరేళ్లే అయింది. అయినా ఈ సమయంలో ఎన్నో పదవులను భర్తీ చేశారు. ప్రతి ఎన్నికలో ప్రజలు కూడా వైసీపీ వెంటే నిలిచారు. ఆ ప్రజానీకాన్ని వచ్చే ఎన్నికల్లోనూ తన వెంట తిప్పుకోవాలంటే జగన్ కు ఒక్కరికే సాధ్యం కాదు. ఎన్నికైన, నామినేట్ అయిన వారంతా తలో చేయి వేయాల్సి ఉంటుంది. జగన్ కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే అడ్వాంటేజీగా మారిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

స్థానిక నేతలు బలంగా ఉంటేనే?

క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండాలన్నా, ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలన్నా స్థానిక నేతలకే సాధ్యమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ఇప్పుడు జగన్ గ్రిప్ లోనే ఉన్నాయి. అందుకే జగన్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ముందు వరసలో ఉన్నారని చెప్పక తప్పదు. జిల్లా పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు, వార్డు మెంబర్లు సమిష్టి కృషి వైసీపీికి అవసరం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు జగన్ దృష్టంతా వచ్చే ఎన్నికలపై పడింది.

మరింత బలోపేతం అయితే?

జిల్లాల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు నేతలకు ఆర్థిక వనరులను కల్పించడంలోనూ జగన్ ఇక దృష్టి పెడతారంటున్నారు. దాని వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. పదవులు లేక నీరసంగా ఉన్న తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టడానికి ప్రస్తుతానికి జగన్ సక్సెస్ దిశగానే పయనిస్తున్నారు. మరి ఎన్నికల వేళకు సమీకరణాలు మారితే చెప్పలేం కాని జగన్ కు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుకూలతే కన్పిస్తుంది.

Tags:    

Similar News