Ys jagan : ముందు ఎన్నికలకు వెళ్లే ఛాన్సే లేదట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతారు? ఆ ఆలోచన చేస్తున్నారా? ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీ విజయం సాధ్యమేనా? ఇదీ ప్రస్తుతం వైసీపీలో [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతారు? ఆ ఆలోచన చేస్తున్నారా? ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీ విజయం సాధ్యమేనా? ఇదీ ప్రస్తుతం వైసీపీలో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతారు? ఆ ఆలోచన చేస్తున్నారా? ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీ విజయం సాధ్యమేనా? ఇదీ ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న చర్చ. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఎలాంటి అవకాశాలు కన్పించడం లేదు. జగన్ ఇప్పుడు ఏపీలో బలంగా ఉన్నారు. విపక్షాలు వీక్ గా ఉన్నాయి. సంక్షేమ పథకాలతో జనం మద్దతును కోరే ప్రయత్నం జగన్ తొలి నుంచి చేస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో కుటుంబాలను పథకాలతో తన పరం చేసుకోగలిగారు.
చేయాల్సింది….
ఇంకా జగన్ చేయాల్సి చాలా ఉంది. ఇటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను కూడా చేసి చూపెట్టాల్సి ఉంది. దీంతో పాటు మూడు రాజధానుల అంశాన్ని కూడా తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగకుండా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తారా? అన్నది ప్రశ్న. జగన్ కు గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ఏపీలో బలంగా నిలిపారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాదనుకుని ముందస్తు ఎన్నికలకు వెళితే చేతకానితనంగా భావించారా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది.
కరోనాతో….
నిజానికి జగన్ 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొలి నుంచి ప్రయత్నం మొదలు పెట్టారు. సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేసి తర్వాత మిగిలిన వాటిపై దృష్టి పెట్టాలనుకున్నారు. కానీ అనుకోకుండా కరోనా రావడం దాదాపు రెండేళ్లు కరోనాతోనే సమయం గడిచిపోవడంతో అనుకున్న పనులను పూర్తి చేయలేకపోయారు. ఇటు పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ పరంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాల్సి ఉంది.
డ్రీమ్ ప్రాజెక్టులన్నీ….
జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పేదలకు ఇంటిస్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇది పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఇంకా సమయం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత వెనక్కు లాగుతున్నాయి. అందుకే జగన్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడంతో పాటు అన్ని సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో గ్రౌండ్ అయిన తర్వాతనే ముందస్తు ఎన్నికలకు వెళతారంటున్నారు.