Ys jagan : విరుగుడు మంత్రం అదేనట.. వారందరికీ నో ఛాన్స్

ఆర్థికంగా బలవంతుడు. అంగ బలం ఉంది. ఇక ప్రజాబలమే కావాలి. అయితే తన పాలనపై ఎలాంటి అపోహలు లేకున్నా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వైసీపీికి వచ్చే ఎన్నికల్లో [more]

;

Update: 2021-09-25 14:30 GMT

ఆర్థికంగా బలవంతుడు. అంగ బలం ఉంది. ఇక ప్రజాబలమే కావాలి. అయితే తన పాలనపై ఎలాంటి అపోహలు లేకున్నా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వైసీపీికి వచ్చే ఎన్నికల్లో ముప్పు తెచ్చిపెడుతుంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కన్పిస్తుంది. దీనికి కారణం వారు ప్రజల్లో అందుబాటులో ఉండకపోవడం, అభివృద్థి కార్యక్రమాలు చేపట్టకపోవడం వంటి కారణాలుగా చెప్పుకోవాలి. అయితే దీనికి జగన్ విరుగుడు మంత్రం కనిపెట్టారంటున్నారు.

రెండుసార్లు వరసగా….

గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వీరిలో వరసగా గెలుస్తూ వస్తున్న వారు దాదాపు ఇరవై అయిదు మంది వరకూ ఉంటారంటున్నారు. మూడు సార్లకు పైగా గెలిచిన వారు కూడా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరసగా గెలిచిన వారిపై కొంత అసంతృప్తి ఉందని వైసీపీ అధినాయకత్వం గుర్తించింది. మూడోసారి కూడా వీళ్లే పోటీ చేస్తే గెలుపు కష్టమవుతుందన్న అనుమానాలు అయితే ఉన్నాయి.

సర్వే అనంతరం…

దాదాపు డెబ్భయి నుంచి ఎనభై నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని జగన్ గుర్తించినట్లు తెలసింది. ఈ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు. సర్వే నివేదికలను అనుసరించే వీరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలా? వద్దా? అన్నది డిసైడ్ చేస్తారు. పార్టీకి నమ్మకంగా ఉన్నప్పటికీ అధికారం మరోసారి దక్కాలంటే వీరిని పోటీకి దూరంగా పెడతారని, వీరికి నామినేటెడ్ పదవుల హామీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

సీనియర్లను కూడా ఈసారి…

ఇలా టిక్కెట్ కోల్పోయే నేతల్లో సీనియర్ నేతలు కూడా ఉండటం విశేషం. 2009 నుంచి వరసగా గెలుస్తూ వస్తున్న రాయలసీమకు చెందిన నేత ఒకరికి ఈసారి జగన్ టిక్కెట్ ఇవ్వరంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన మరో సీనియర్ నేతను కూడా పెద్దల సభకు పంపే యోచనలో ఉన్నారట. చిత్తూరు జిల్లాకు చెందిన మరో నేత కు కూడా ఈసారి టిక్కెట్ ఇవ్వకుండా పార్టీలో కీలక పదవి ఇవ్వాలని యోచిస్తున్నారు. మొత్తం మీద జగన్ మరోసారి అధికారం కోసం ఎవరినైనా పక్కన పెట్టాలని భావిస్తుండటంతో పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News