Ysrcp : కుప్పం మాదిరిగానే అన్నింటా బద్దలేనట

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు తమ టార్గెట్ రీచ్ అయ్యారు. జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మంత్రులకు లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రులతో పాటు [more]

Update: 2021-09-19 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు తమ టార్గెట్ రీచ్ అయ్యారు. జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మంత్రులకు లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రులతో పాటు ఆ ప్రాంతానికి చెందిన మంత్రులకు కూడా బాధ్యతలను పంచారు. ఫలితాలను బట్ి పదవి ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే కరోనా కారణంగా పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ ఎన్నికలు దశలు వారీగా జరిగాయి.

మూడు ఎన్నికల్లోనూ….

ఈ మూడు ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించింది. మున్సిపాలిటీలో తాడిపత్రి తప్ప అన్నింటినీ వైసీపీ కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం విజయాలను నమోదు చేసుకుంది. పార్టీ శ్రేణులను సరైన దారిలో నడపటం, సరైనఅభ్యర్థులను ఎంపిక చేయడంలోనూ మంత్రులు కీలక పాత్ర పోషించారు. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది.

మంత్రులకు పార్టీ బాధ్యతలు….

మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉన్నా 90 శాతం మందిని మారుస్తానని జగన్ ముందే చెప్పారు. అయితే స్థానికసంస్థల ఎన్నికల సమయంలో మాత్రం ఎన్నికల్లో పనితీరు కనపర్చకపోతే నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా చేయాల్సి ఉంటుందని కూడా జగన్ హెచ్చరించారు. దీంతో మంత్రులందరూ తమ పరిధిలో ప్రచారంతో పాటు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగానే ఈ రిజల్ట్ వచ్చాయి.

అన్ని ఎన్నికల్లో….

ఇప్పుడు ఏపీలో దాదాపు అన్ని ఎన్నికలు ముగిసినట్లే. ఇక జనరల్ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఎన్నికలకు సమర్థతను బట్టి ప్రస్తుతం ఉన్న మంత్రులకు పార్టీ బాధ్యతలను అప్పగించాలన్న యోచనలో ఉన్నారని తెలిసింది. ప్రధానంగా కుప్పం నియోజకవర్గంలా ప్రతి నియోజకవర్గంపై పట్టు పెంచుకోవాలన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారు. దశాబ్దాల చంద్రబాబు కోటను బద్దలు కొట్టినట్లు అన్ని నియోజకవర్గాల్లో అదే స్పీడ్ పెంచాలని జగన్ అందుబాటులో ఉన్న మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News