Ys jagan : ఆ ఒక్కటి సెట్ చేస్తే చాలట
వైసీపీ అధినేత జగన్ పార్టీలో తానే సుప్రీం. పార్టీకి ఇప్పటి వరకూ రాజకీయ వ్యవహరాల కమిటీ లేదు. పొలిట్ బ్యూరో ఉందో లేదో తెలియదు. రాష్ట్ర స్థాయి [more]
;
వైసీపీ అధినేత జగన్ పార్టీలో తానే సుప్రీం. పార్టీకి ఇప్పటి వరకూ రాజకీయ వ్యవహరాల కమిటీ లేదు. పొలిట్ బ్యూరో ఉందో లేదో తెలియదు. రాష్ట్ర స్థాయి [more]
వైసీపీ అధినేత జగన్ పార్టీలో తానే సుప్రీం. పార్టీకి ఇప్పటి వరకూ రాజకీయ వ్యవహరాల కమిటీ లేదు. పొలిట్ బ్యూరో ఉందో లేదో తెలియదు. రాష్ట్ర స్థాయి కమిటీ అయితే మాత్రం ఉంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన సొంతంగా తీసుకుంటున్నవే. ప్రభుత్వ పరంగా నిర్ణయాలను జగన్ తీసుకోవడంలో అర్థముంది. అప్పుడప్పుడూ మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించి ఆమోదం తెలుపుతుండటంతో ఈ నిర్ణయాలకు అర్థముంది.
జగన్ మాత్రమే….
పార్టీపరమైన నిర్ణయాలు జగన్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పడు పార్టీ సమావేశాలను జరపాల్సి ఉంటుంది. ప్లీనరీని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించలేదు. కరోనా కారణంగా నిర్వహించలేక పోయారను కుందాం. ఇప్పుడైనా ప్లీనరీ నిర్వహించి జగన్ కార్యకర్తల ముందుకు వస్తే బాగుంటుందన్న సూచనలు అందుతున్నాయి.
స్వయం నిర్ణయాలే….
ఇక ఇటీవల పదవుల భర్తీ విషయంలో కూడా జగన్ పార్టీ పరంగా ఎవరినీ సంప్రదించలేదు. స్వయంగా ఆయన నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. జిల్లా పరిషత్, మండలప పరిషత్ ఛైర్మన్ల నియమకంలో స్థానిక వైసీపీ నేతల అభిప్రాయాలను జగన్ సేకరించలేదు. నియోజకవర్గాల్లో తమకు సన్నిహితులైన వారి నుంచి సమాచారాన్ని సేకరించి పదవులను కట్టబెట్టారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
కార్యకర్తలలో….
ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. ఈలోగా పార్టీ ని బలోపేతం చేయాలంటే కేవలం పదవులు ఇస్తే సరిపోదు. పార్టీ పరంగా అన్ని కమిటీలను మండల, జిల్లా స్థాయిలో నియమించాలి. పొలిట్ బ్యూరో నియామకం చేపట్టాలి. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా జగన్ అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటేనే ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందన్న సూచనలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద ఏ ఎన్నికల్లో అయినా గెలుపు వైసీపీదే అయినా పార్టీ పరంగా అసంతృప్తి తలెత్త కుండా జగన్ జాగ్రత్త పడాల్సి ఉంటుంది.