Ys jagan : ఇక జగన్ ఫోకస్ మారిందట

ఏ రాజకీయ పార్టీ కైనా ఎన్నికలు ముఖ్యం. ఎన్నికల ఫలితాలు పార్టీ ఉథ్థాన పతనాలను నిర్ణయిస్తాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా తాను ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడతానని [more]

;

Update: 2021-10-05 14:30 GMT

ఏ రాజకీయ పార్టీ కైనా ఎన్నికలు ముఖ్యం. ఎన్నికల ఫలితాలు పార్టీ ఉథ్థాన పతనాలను నిర్ణయిస్తాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా తాను ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడతానని తరచూ చెప్పేవారు. అలాగే ఇప్పుడు జగన్ సయితం అన్ని ఎన్నికలను పూర్తి చేసుకున్నారు. రాజమండ్రి కార్పొరేషన్ మరో చిన్నా చితకా ఎన్నికలు తప్ప ఏపీలో అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక 2024 వరకూ ఎలాంటి ప్రధాన ఎన్నికలు లేవు.

ఎన్నికల కోసమే….

గత రెండున్నరేళ్ల నుంచి జగన్ ఈ ఎన్నికల కోసమే వెయిట్ చేశారు. అందుకే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి జగన్ సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టి ప్రజల్లో బలం పెంచుకోగలిగారు. దాదాపు మూడు కోట్ట కుటుంబాలకు ఏదో ఒక రూపంలో ఆర్థిక సాయం అందిస్తూ వారిని పార్టీ వైపు తిప్పుకోగలిగారు. ఆ ప్రభావమే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకూల ఫలితాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా 90 శాతానికి పైగానే స్థానిక సంస్థల్లో స్థానాలను కైవసం చేసుకోగలిగారు.

జెండా ఎగరాలన్నదే….

అసలు జగన్ లక్ష్యం అదేనట. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలపడాలంటే పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకూ వైసీపీ జెండా ఎగరాలన్నది ఆయన ఆలోచన. అందుకే ప్రధాన సమస్యలన్నింటినీ పక్కన పెట్టి కేవలం సంక్షేమంపైనే ఫోకస్ పెట్టారు. సక్సెస్ అయ్యారు. ఇప్పుడు జగన్ అజెండా మారిందంటున్నారు. సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తూనే నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.

ఇప్పుడు పార్టీపై కూడా….

తన పాదయాత్ర సందర్భంగా వివిధ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలను అమలుపర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కొన్నింటిని ఇప్పటికే పూర్తి చేసినా నిధుల అవసరం ఉన్న సమస్యలను మాత్రం ఇప్పటి వరకూ జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు వాటిని తెప్పించుకుని వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు. దీంతె ఎమ్మెల్యేలు కూడా సంతోష పడుతున్నారు. ఇక పూర్తి స్థాయి పార్టీ మీద కూడా జగన్ ఫోకస్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News